చైనా..భారత్ సరిహద్దు దగ్గర సిద్ధంగా ఉన్న సైనికులు..ఉద్రిక్తంగా మారిన వాతావరణం

265

పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 49మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అశువులుబాసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిపై యావత్ భారతావని భగ్గుమంటోంది.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ నినదిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పాక్ తీరును ఎండుగడుతున్నారు. భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని దేశ సైనికులు ఎదురుచూస్తున్నారు. యుద్ధం ప్రకటిస్తే బాగుండు అని ఇండియా మొత్తం అనుకుంటుంది. అయితే కొందరు చర్చలు జరపాలని అంటున్నారు. కానీ మోడీ వేరేలా అంటున్నాడు.

Image result for pulwama

చర్చలకు సమయం ముగిసిందని ఇక చర్యలకు సమయం ఆసన్నం అయ్యిందని ప్రధానమంత్రి మోడీ అన్నాడు. పూల్వమా ఘటనతో చర్చలకు ఇక సమయం లేదని ఉగ్రవాదంతో పాటు దానికి మద్దత్తు తెలిపే వారిపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే ప్రోత్సహించినట్టే అవుతుందని ఆయన చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.భారత్ లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు అయినా మార్సెటైనా మ్యాటీతో ప్రధాని చర్చలు జరిపారు. తర్వాత ఉగ్రవాదానికి సంబంధించిన ఒక ప్రకటనను ఇద్దరు నేతలు విడుదల చేశారు. చర్చలకు ఇక సమయం లేదని ప్రత్యక్ష చర్యలకు సమయం ఆసన్నం అయ్యిందని ఆయన అన్నాడు. ఉగ్రవాదాన్ని దానిని చేస్తున్న పాకిస్తాన్ ను పాక్ కు సపోర్ట్ చేస్తున్న చైనాకు ఎదురు తిరిగి అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని మోడీ అన్నాడు. చర్యలు తీసుకోకుండా సమయం వేస్ట్ చేసుకుంటూపోతే ఉగ్రవాదాన్ని ఇంకా పెంపొందించినట్టే అవుతుందని ఆయన ఆ ప్రకటనలో తేల్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఉగ్రవాదం విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకరికి ఒకరు సహాయం చేసుకోడానికి ఒక వేదిక అవసరమని దానిని ఏర్పాటుచేయడానికి మోడీ మరియు మ్యాట్రి మద్దత్తు ప్రకటించారు. చర్చల సందర్భంగా రెండు దేశాలు రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాలలో సహకారానికి సంబంధించిన 10 ఒప్పందాల మీద సంతకాలు చేశారు. అయితే కాశ్మీర్ లో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ చైనా సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం చెయ్యాల్సి వస్తే పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నచైనాతో కూడా యుద్ధం చెయ్యవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యుద్ధంలో భారత్ మీద చైనా విజయం సాధించడం కూడా అంత తేలికైన విషయం ఏమి కాదు.కానీ ఇరుదేశాలు కోలుకోలేని దెబ్బ తింటాయి. ఒకవేళ యుద్ధం సమయంలో పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ ఇస్తే ఏ మాత్రం భయపడకుండా పోరాటం చేస్తామని సైనికులు అంటున్నారు. మరి మీరేమంటారు. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం వస్తే ఏమవుతుంది. చైనా సపోర్టింగ్ తో భారత్ కు నష్టమా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.