చైనా ప్రభుత్వం ముస్లింలను ఎంత భయంకరంగా బాధపెడుతుందో తెలుసా..

241

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో కొన్ని కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉన్నట్టే ముస్లింలకు కూడా కొన్ని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. వారు ఏ దేశంలో ఉన్నా కూడా వారి మత ఆచారాలను పాటిస్తారు ఒక్క దేశంలో తప్ప. ఆ దేశమే చైనా. ఇక్కడ ముస్లింలు వారి మత ఆచారాలను పాటించకూడదు . అంతేకాదు ఇక్కడ ముస్లింలను చాలా దారుణంగా హింసిస్తారు. ఇప్పుడు చైనాలో ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Image result for muslims

చైనాలోని పశ్చిమ ప్రాంతంలో సింజియాన్ నగరం ఉంది. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండటం వలన చైనా ఈ నగరం మీద దృష్టి పెట్టింది. ఇతర దేశాల టెక్నాలజీని వారి దేశంలోకి రానివ్వని చైనా ఇతర దేశ మతస్థులను వారి దేశంలోకి అస్సలు రానివ్వదు. సింజియాన్ కు బార్డర్ లో ఇండియా, ఆఫ్గనిస్తాన్, మంగోలియా వంటి దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. నిజం చెప్పాలంటే ఇది టిబెట్ లాగానే ఒక ఇండిపెండెంట్ స్టేట్. కానీ అక్కడి గవర్నమెంట్ బీజింగ్ చేతిలో ఉంది. సింజియాన్ లో నివసించే ముస్లింలకు చైనా అనేక కట్టుదిట్టమైన రూల్స్ ను విదిస్తుంది. సింజియాన్ లో ముస్లింలు పొడవాటి గడ్డాలు పెంచుకోకూడదు.. అలా గడ్డం పెంచుకోవడం అక్కడ నిషిద్ధం. చైనాలో మసీదులలో ప్రార్థనలు చెయ్యకూడదు..అక్కడ ప్రార్థన సౌండ్స్ అనేవి అస్సలు ఉండవు. ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో కూడా ఇక్కడ మైక్ సౌండ్స్ పెట్టరు. దీని గురించి ఎవరు కూడా నోరు మెదిపే సాహసం చెయ్యరు. ముస్లిం ప్రజలపై నిరంతరం నిఘా ఉండటమే దీనికి కారణం. ఇస్లాంకు చెందిన ఒక సూక్తి చదివినా కూడా వారిని జైలుకు పంపిస్తారు. ఇలా ఎందరో జైలుకు వెళ్లారు. ఇప్పటికి జైలులోనే ఉన్నారు. ఆ ముస్లింలను కమ్యూనిస్ట్ పాటలు పాడాలని చైనా బలవంతం చేస్తుంది. లేకుంటే వారిని తీవ్రంగా హింసిస్తారు. అయితే 2015లో కొంతమంది ఎలాగోలా తప్పించుకుని టర్కీకి శరణార్థులుగా వెళ్లారు. టర్కీలలో వేగర్స్ ముస్లింలకు భాషతో పాటు విశ్వసాల్లో సారూప్యం కూడా ఉంటుంది.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే 2015 తర్వాత జైలుకు వెళ్లిన ఏ ముస్లిం కూడా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. దాదాపు 10 లక్షల మంది వీగర్ ముస్లింలను చైనా జైళ్లలో నిర్బంధించారు. చైనాలో కోటికి పైగా ముస్లింలు ఉండే సింజియాన్ లో ఇలా జరుగుతున్నట్టు ఐరాస చెబుతుంది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం.. ఐఎస్ మిలిటెంట్స్, వేర్పాటువాదుల వలన ఇలా హింస జరుగుతుందని చెబుతుంది. వీగర్ ముస్లింకు చెందిన ఒక వ్యక్తి తన బంధువును కలవడానికి ఒకసారి జింగ్ జియాంగ్ కు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ రోబోలుగా ఉన్నారు. తమ ఆత్మను కోల్పోయిన వారీగా కనిపించాడు. గతంలో ఉన్నట్టుగా వారు ఇప్పుడు లేరు. మతపరమైన చర్యలను ఎదుర్కోవడానికి చైనా ఈ చర్యలకు పాల్పడుతుంది. ఇతర మతస్థులు కావడం వలన వారిని కుక్కలా కంటే హీనంగా చూస్తుంది. నిర్బంధంలో ఉన్నవారిచేత పార్టీ నినాదాలు చేయిస్తుంది. జైలులో ఉన్న వారికి ఆహారం ఇవ్వకుండా హింసిస్తుందని వరల్డ్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఆరోపిస్తుంది.కాని చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇలా అక్కడ ముస్లింలు నరకయాతన అనుభవిస్తున్నారు. వీరికీ ఎప్పటికైనా విముక్తి కలగాలని కోరుకుందాం.