ఈ మూడు వ‌స్తువులు పిల్ల‌లు ఇంట్లోకి తీసుకురాకుండా చూడండి ఇవి చాలా డేంజ‌ర్.!

597

చాలా మంది చిన్న పిల్ల‌లు వారికి తెలిసి తెలియ‌క ఏది దొర‌కితే దానితో ఆడుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా కంటికి ఏది ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తే దానితో ఆడుకుంటారు.. అది వారికి తెలియ‌ని త‌నం.. ఈ స‌మ‌యాల్లో చిన్న‌పిల్ల‌కు రోడ్ల‌పై ఎటువంటి బొమ్మ‌లు దొరికినా వారు వెంట‌నే ఆట‌బొమ్మ అనుకుని ఇంట్లోకి తీసుకు వ‌స్తారు.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లోకి నెగిటీవ్ ఎన‌ర్జీ కూడా వ‌స్తుంది.. అయితే రోడ్ల‌పై కాని, ఖాళీ ప్ర‌దేశాల్లో కాని దొరికే బొమ్మ‌ల‌ను పిల్ల‌లు ఇంట్లోకి తీసుకువ‌స్తే వెంట‌నే వాటిని బ‌య‌ట వేసెయ్యండి.. ఇక చిన్న‌పిల్ల‌లు ఇంట్లోకి ఈ మూడు వ‌స్తువులు తీసుకువ‌స్తే, చాలా డేంజర్ అని మీరు గుర్తించాలి.. ఓసారి ఆమూడు వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొమ్మ‌లు
చిన్న‌పిల్ల‌లు రోడ్ల‌పై ఆడుకునే స‌మయంలో కొన్ని బొమ్మ‌లు క‌నిపిస్తాయి.. అది ర‌బ్బ‌ర్ బొమ్మ, లేదా ప్లాస్టిక్ బొమ్మ అయి ఉంటాయి.. వాటిని ఇంట్లోకి తీసుకు రాకుండా చూడాలి.. ఎందుకంటే తాంత్రికులు ఎవ‌రైనాస‌రే అలాంటి బొమ్మ‌ల‌పై తాంత్రిక పూజ‌లు చేస్తారు.. రోడ్ల మీద ప‌డి ఉన్న ఆ బొమ్మ‌ల పై తాంత్రిక పూజ‌లు చేసి ఉండ‌వ‌చ్చు, అందుకే పిల్ల‌లు ఎక్క‌డైనా బొమ్మ క‌నిపిస్తే తీసుకురాకుండా త‌ల్లిదండ్రులు వారికి చెప్పాలి.

జుట్టు
ఇక పిల్ల‌ల‌కు రోడ్ల‌పై గాలికి వ‌చ్చిన జుట్టును కూడా త‌మ ఆట‌బొమ్మ‌ల‌లో పెట్టుకుంటారు.. అలాగే చెక్క బొమ్మ‌ల్లో ఎక్కువ‌గా జుట్టును దాచుకుంటారు.. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం.. ఇలా జుట్టును తీసుకోవ‌డం వ‌ల‌న ఇంట్లోకి నెగిటీవ్ ఎన‌ర్జీ రావ‌డంతో పాటు, అది చాలా చేటుచేస్తుంది.. తాంత్రిక‌పూజ‌లు చేసేవారు చేత‌బ‌డి, బాణామ‌తి వంటి విద్య‌లు ప్ర‌ద‌ర్శించేవారు చాలా మంది జుట్టుతోనే ఇటువంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌తారు…. అందుకే ఇటువంటి వాటిని తీసుకురాకూడ‌దు. ఇలాంటి వాటిని ఇంట్లోకి తీసుకురాకూడ‌దు అని పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే తెలియ‌చేయాలి.

ఇక మూడ‌వ‌ది నిమ్మ‌కాయి

నిమ్మ‌కాయ ఇది పూజా కార్యక్ర‌మాల‌కు దిష్టికి అత్య‌ధికంగా వాడ‌తారు.. ఇక ఇంట్లో ఉండే నెగిటీవ్ ఎన‌ర్జీని ఇది తొల‌గిస్తుంది అని న‌మ్ముతారు…. ఇక వీటిని పూజ‌ల‌కు ఉప‌యోగించి రోడ్ల‌పై ప‌డేస్తుంటారు.. ఈ స‌మ‌యాల్లో నిమ్మ‌కాయ‌ల‌ను పిల్ల‌లు ఇంట్లోకి తీసుకువ‌స్తారు.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో దుష్ట‌శ‌క్తి వ‌స్తుంది అని చెబుతారు.. అందుకే పిల్ల‌ల‌ను రోడ్ల‌పై క‌నిపించే నిమ్మ‌కాయల‌ను, జుట్టు, బొమ్మ‌లు తీసుకురాకూడ‌దు అని చెప్పాలి.. అందుకే ఇలాంటి ప్ర‌తీ విష‌యాన్ని పిల్ల‌ల‌కు తెలియ‌చేయాలి.. ఆడుకోవ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో ఏ వ‌స్తువులు ముట్టుకోకూడ‌దు అనేది కూడా వారికి చెప్పాలి.. చూశారుగా ఇంట్లో పిల్ల‌లు ఉంటే క‌చ్చితంగా ఇటువంటి విష‌యాలు తెలియ‌చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.