ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారం ఎంత దారుణం చేసారో తెలిస్తే వాళ్ళని చెప్పు తో కొట్టి గాడిద మీద ఊరేగిస్తారు

353

దేశరాజ‌ధానిలో క్రైమ్ రేట్ మ‌రింత పెరిగిపోతోంది.. ఏదో ఓ విష‌యంలో రాజ‌కీయాల‌తో పేరు వినిపించే హ‌స్తిన ఇప్పుడు అక్ర‌మాలు దోపిడీలు మాన‌భంగాల‌తో రోజూ వార్త‌ల్లోకి వ‌స్తోంది. ఢిల్లీలో బురారీ కుటుంబ‌లో ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.. ఇక చిన్నారులపై కూడా, అమానుష దాడులు, వింత పోక‌డ‌లు, లైంగిక వికృతానందాల‌కు పాల్ప‌డుతున్నారు కొంద‌రు కామాంధులు.. ఇక చిన్నారుల‌పై మ‌హిళ‌ల‌పై దారుణాల రేటులో ఢిల్లీ మొద‌టిస్ధానంలో ఉంది.. ఇక్క‌డ క్రైమ్ రేట్ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది కాని త‌ర‌గ‌డం లేదు.

Image result for child abusing

తాజాగా ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను మార్కెట్‌లో పడేసి వెళ్లిపోయారు కామాంధులు. సాయంత్రం తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి.. కొద్దిసేప‌టికి కనిపించకుండా పోయింది… ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ చిన్నారి కుటుంబ‌స‌భ్యులు గాలించారు..ఆ అమ్మాయి ఆచూకి దొర‌క‌పోవ‌డంతో సిటీ కాబ‌ట్టి కిడ్నాప్ జ‌రిగి ఉంటుంది అని వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. ఇక పిల్లల మిస్సింగ్ విష‌యంలో లేటు చేయ‌కుండా పోలీసులు విచార‌ణ‌లో ముందు ఉంటారు….దీంతో ఆమె కోసం గాలించ‌డం మొద‌లు పెట్టారు, అలాగే మూడు స్పెష‌ట్ టీం లు పాప ఆచూకి కోసం వెతికాయి.

Image result for child abusing

ఈ క్రమంలో ఇవాళ ఉదయం కమలా మార్కెట్ ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను హస్పిటల్‌కు తీసుకువెళ్ల‌గా.. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అత్యాచారానికి గురైనట్లు పోలీసుల‌కు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.. అయితే చిన్నారిపై అత్యాచారం చేసిన వారిని వ‌దిలిపెట్ట‌కూడ‌దు అని కోరుతున్నారు కుటుంబ స‌భ్యులు.. ఇలా ఆరేళ్ల చిన్నారిపై దాడి చేయ‌డం అత్యాచారం చేయ‌డం పై సీరియ‌స్ కేసుగా తీసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు..

ఆ పాప ఆడుకున్న ఇంటి ద‌గ్గ‌ర సీసీ టీవీ కెమెరాల‌తో పాటు ఇటు మార్కెట్ ద‌గ్గ‌ర షాపుల ద‌గ్గ‌ర సీసీ కెమెరాలు కూడా ప‌రిశీలిస్తున్నారు… ఆమెని ఎక్క‌డికైనా తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చారా లేదా ఆమెపై అత్యాచారం ఇక్క‌డే చేశారా అని పోలీసులు కేసును మ‌రింత క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు.. అలాగే వారి కుటుంబ స‌భ్యుల‌ను, అలాగే మిస్సింగ్ త‌ర్వాత కనిపించ‌కుండా ఆ ఏరియాలో ఉంటున్న‌వారిని, పాప‌తో అతిగా ఎవ‌రు చ‌నువుగా ఉంటారో వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు…ఇక పాప కాస్త కోలుకుంటే క‌చ్చితంగా నింధితుల‌ను గుర్తిస్తుంది అని అంటున్నారు… మ‌రి ఇలాంటి నీచులు దొరికితే ఎటువంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.