ఆమెకు ఉన్న వ్యాధి వల్ల భ‌ర్త వ‌దిలేశాడు ఇప్పుడు ఆమె పెద్ద సెలబ్రెటీ అయింది ఎలాగో తెలిస్తే షాక్

376

కొంద‌రు మ‌హిళ‌ల్ని చాలా చుల‌క‌న‌గా చూస్తారు పురుషులు.. ముఖ్యంగా స‌మాజం ఇంత అభివృద్ది చెందుతున్నా స‌రైన విధంగా అర్ధం చేసుకోరు.. స్త్రీ శ‌క్తిని చాలా చుల‌క‌న‌గా చూస్తారు.. ముఖ్యంగా స్త్రీల‌కు స‌మాన హ‌క్కులు అన్నీ విష‌యాల‌లో వ‌స్తున్నా, ఇంత వేగంగా అన్నీ రంగాల్లో త‌మ హ‌స్తం చూపుతున్నా, వారు అన్నింటా అడుగుపెడుతున్నా, అభివృద్ది చెందుతున్నా కొంద‌రు మాత్రం చాలా చుల‌క‌న‌గా చూస్తారు. ఇలా త‌న భ‌ర్త ఆమెని చుల‌క‌న‌గా చూడ‌టంతో ఆమె ఏమి చేసిందో తెలిస్తే కాస్త బాధ‌ప‌డ‌తారు, ఆమెకు ఇంత ఇబ్బంది వ‌చ్చిందాఅని క‌న్నీరు తెప్పిస్తుంది, కాని ఆమె కృంగిపోకుండా ఏమీ సాధించిందో తెలిస్తే ఆనందిస్తారు, అలాగే ఆమెని చూసి గ‌ర్వ‌ప‌డ‌తారు

చెన్నైకి చెందిన రూబీ కథ మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆమెను స్థూలకాయురాలని ఆరోపిస్తూ భర్త వదిలేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఆమె కుంగిపోకుండా ధైర్యంతో ముందడుగువేసి బాడీబిల్డర్‌గా మారి దేశవ్యాప్త గుర్తింపు పొందింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం రూబీకి ఆరేళ్ల కుమారుడున్నాడు. కొడుకు పుట్టిన తరువాత ఆమె బరువు పెరగడం ప్రారంభించింది. ఒకవైపు భర్త వదిలివేయడం, మరోవైపు ఇంట్లోని వారి సూటీపోటీ మాటలతో ఆమె సతమతమయ్యేది. ఈ నేపధ్యంలోనే ఫిట్‌నెస్ పెంపొందించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా నిపుణుల సలహాతో కఠినమైన వ్యాయామాలు చేస్తూ బాడీబిల్డర్‌గా మారిపోయింది. కేరళలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొని, జాతీయస్థాయిలో పతకాన్ని అందుకుంది. అలాగే తమిళనాడు నుంచి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న మహిళగానూ రూబీ పేరు సంపాదించుకుంది.

ఇలా కుటుంబం ఆమెను ప‌క్క‌న పెట్టినా ఆమె ఆత్మ‌విశ్వాసంతో ఇంత స్ధాయికి చేరుకుంది ఏ కుటుంబం అయితే ఆమెని నిరాకరించిందో ఇప్పుడు ఆకుటుంబం ఆమెని మెచ్చుకుంటోంది.. మా కోడ‌లు అని ఆమె కుటుంబ స‌భ్యుల‌కు పొగ‌డ్త‌లు ఇస్తున్నారు. మ‌రి చూశారుగా ఆమెకి ఎంత రెస్పెక్ట్ సొసైటీలో వ‌చ్చిందో.. జాతీయస్థాయిలో పతకాన్ని అందుకుంది. అలాగే తమిళనాడు నుంచి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న మహిళగానూ రూబీ పేరు సంపాదించుకుంది. ఇది ఆమె కుటుంబానికి ఆమెని ద‌గ్గ‌ర చేసింది. త‌న భ‌ర్త ఇప్పుడు ఆమెని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నాడు ఇలా అవుతుంది అని అనుకోలేదు అని అంటున్నాడు అయితే ఆ కుటుంబం మ‌ళ్లీ క‌లుస్తుందా లేదా తెలియ‌దు కాని ఆమెకి మంచి సెల‌బ్రెటీ హోదా అయితే వ‌చ్చింది. చూశారుగా ఆమె ప‌ట్టుద‌ల‌తో ఎటువంటి సాధ‌న చేసి ఇలాంటి పేరు సంపాదించిందో. స‌మాజంలో ఏదో ఒక‌టి సాధించాలి అని ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా చేసి నిరూపించ‌వ‌చ్చు అని చెప్పింది ఆమె.