హైదరాబాద్ లో మళ్ళీ హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో చూడండి.

311

చెడ్డీ గ్యాంగ్..కొన్ని రోజుల క్రితం జనాలను భయపెట్టిన గ్యాంగ్.ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దొంగతనం చేస్తారో తెలియక జనాలు ఇళ్లకు తాళాలు వెయ్యడమే మానేశారు.పోలీసులను ముచ్చెమటలు పట్టించిన ఈ గ్యాంగ్ కొన్ని రోజులకే పోలీసులకు దొరికిపోయారు.రాచకొండ పోలీసులు ఆరు నెలల ప్రయత్నం తర్వాత విజయవంతంగా వీరికి సంకెళ్లు వేశారు. గుజరాత్‌కు చెందిన ముఠా సభ్యులంతా పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఆదివాసీలని పోలీసులు తెలిపారు. చెడ్డీ గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. విచిత్ర వేషధారణతో వచ్చి దొంగతనాలకు పాల్పడే ఈ గ్యాంగులోని అందరిని అరెస్ట్ చేశాం అని చెప్పారు.దాంతో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు.కానీ ఇప్పుడు మళ్ళి ఆ గ్యాంగ్ ముఠా బయటకు వచ్చింది.ఆ గ్యాంగ్ లో ఇంకా ఎవరో ఉన్నారు.వారు దొంగతనాలు చెయ్యడం మొదలుపెట్టారు.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం తెల్లవారు జామున చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసింది. కత్తులు, రాడ్లతో చొరబడగా స్థానికులు గమనించి కేకలు వేయడంతో పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. శంషాబాద్ పరిధిలోని నక్షత్ర విల్లాస్ కాంపౌండ్ వాల్‌పై ఉన్న కరెంట్ తీగలు కత్తిరించి , కాలనీలోకి చొరబడ్డారు. 8 మంది నిక్కర్లు, బనియన్ల ధరించి కత్తులు, రాడ్లు పట్టుకుని అపార్టుమెంట్‌లోకి వచ్చారు. గమనించిన అపార్టుమెంట్‌వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో దుండగులు కాలనీ ప్ర హారీ దూకి పరారయ్యారు. వెంటనే అపార్టుమెంట్‌వాసులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగుల చేతుల్లో కత్తులు, రాడ్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా… ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని, నిందితులను పట్టుకుంటామని సీఐ గంగాధర్ తెలిపారు.చూడాలి మరి ఈ గ్యాంగ్ పట్టుబడే వరకు ఎన్ని దొంగతనాలు పాల్పడతారో ఎందరి ఇళ్లలో దొంగతనాలు చేస్తారో.మీరు మాత్రం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కొంచెం జాగ్రత్త.