ముందు నాతో శృంగారం చేయి, ఆ తరువాత నమ్ముతా…షాకింగ్ నిజాలు బయట పెట్టిన స్టార్ హీరోయిన్

703

విభేదాల కారణంగా చాలా మంది సెలెబ్రిటీలు విడిపోయే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సెలెబ్రిటీ జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. బుల్లి తెరపై అందాల నటిగా గుర్తింపు తెచ్చుకున్నా చాహత్ ఖన్నా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. నెల క్రితమే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చాహత్ ఖన్నా తన వ్యక్తిగత విషయాలు వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. తన భర్త ఫర్హాన్ మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఆమె ఏమన్నదో చూద్దామా.

చాహత్ ఖన్నా బుల్లితెర నటిగా బిజీగా గడుపుతోంది. ఆమె పలు టివి షోలు, సీరియల్స్ లో నటిస్తూ రాణిస్తోంది. కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంది. 32 ఏళ్ల ఈ నటి 2013లో ఫరాన్ మీర్జాని రెండవ వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఇటీవల వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడం, భర్త నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే తన భర్త నుంచి విడిపోయిన చాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఎంత సైకోనో వివరించింది. ఒకసారి తనకు ఎదలో విపరీతమైన నొప్పి కలిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా. కానీ అతడు చెప్పిన సమాధానం మానసికంగా హింసించింది. నీకు ఎద నొప్పిగా ఉంటే ఇప్పుడు నాతో శృంగారం చేయి, అప్పుడు నమ్ముతా అంటూ సైకోలా ప్రవర్తించాడు . అతడి సైకో ప్రవర్తనతో చిత్రహింసలు అనుభవించా. నేను మరణించినా అతడు పట్టించుకోడని అర్థం అయింది. కేవలం లైంగిక హింస మాత్రమే కాదు, మానసికంగా, ఆర్థికంగా కూడా వేధించేవాడు.అతడొక అనుమానపు పక్షి.

రాను రాను అతని అనుమానాలు తారాస్థాయికి చేరాయి. చివరకు తన సహనటుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని వేధించేవాడు. ఇంట్లో వాతావరణం నాకు పిచ్చెక్కేలా చేసేది. తాను నటిస్తున్న టివి సీరియల్ సెట్స్ లోకి అకస్మాత్తుగా వచ్చేవాడు. అక్కడ గందరగోళం సృష్టించేవాడు. సెట్స్ లో సహనటులతో మాట్లాడినా, హగ్ చేసుకున్నా, కనీసం చేయి కలిపినావాళ్ళతో నీకు ఏంటి సంబంధం అని వేధించేవాడు . ఓ సారి తన కో యాక్టర్ ఒకరు గృహప్రవేశానికి ఆహ్వానించారు. ఆ వేడుకకు హాజరు కావడానికి వెళుతుంటే గృహప్రవేశానికి వెళుతున్నావా లేక డేటింగ్ చేయడానికి వెళుతున్నావా అని ప్రశ్నలతో చిత్రవాధ చేసేవాడు. ఇటీవల తన భర్త మరింత దిగజారి ప్రవర్తించాడు. చివరకు పిల్లలపై కూడా అనుమానం వ్యక్తం చేసేవాడని, అసలు వీళ్లు నాకు పుట్టిన పిల్లలేనా అని అనుమానం వ్యక్తం చేయడంతో తాను దాదాపుగా చనిపోయినంత పని అయ్యింది. గొడవ జరిగే సమయంలో పశువులా మీద పడి కొట్టేవాడు.విసిగిపోయి ఇక అతనితో వేగలేక విడాకులు తీసుకున్నా అని చాహత్ ఖన్నా పేర్కొంది.విన్నారుగా చాహత్ ఖన్నా దాంపత్య జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొందో.