కేంద్ర‌ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక నుండి స్టడీ సర్టిఫికెట్లపై ఇది త‌ప్ప‌నిస‌రి.!

475

మ‌నం పిల్ల‌ల‌ను స్కూల్లో చేర్చిన స‌మ‌యంలో కులం మ‌తం ఎలా క‌చ్చితంగా చెబుతామో ఇక వారి పేరెంట్స్ నేమ్స్ కూడా ఇస్తాం.. ఎక్కువ‌గా పురుషాధిక్యం ముందు నుంచి ఉంది కాబట్టి, ప్ర‌తీచోటా తండ్రి పేరు కామ‌న్ గా ఉంటుంది అంటారు.. త‌ల్లి పేరు కూడా ఉండాల‌ని ఇది ఎంత వ‌ర‌కూ క‌రెక్ట్ అని ఎప్ప‌టి నుంచో కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.. స‌ర్టిఫికెట్ల పై త‌ల్లిదండ్రుల ఇద్ద‌రి పేర్లు ఉండాలి అని వారి డిమాండ్.. ఇక స‌ర్టిఫికెట్లు ఏది జారీ చేసినా క‌చ్చితంగా త‌ల్లి దండ్రుల పేర్లు ఉండేలా, వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి అని ప్ర‌భుత్వం పై ఎప్ప‌టి నుంచో పోరాటం చేసిన వారు ఉన్నారు. పురుషాధిక్యంలో భాగంగా దీనిలో మార్పు రావాలి అని వారి డిమాండ్.

ఇక ఇప్పుడు కేంద్రం తాజాగా ఈ కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…స్టడీ సర్టిఫికెట్ల జారిలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో చాలా మంది ఆనందంలో ఉన్నారు.. ఇప్పటి నుంచి విద్యాసంస్థలు, యూనివర్శిటీలు జారీ చేసే సర్టిఫికెట్లలో అభ్యర్థి తల్లిపేరు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు విద్యార్థి పేరు, తండ్రిపేరు, తండ్రి లేని పక్షంలో గార్డియన్ పేరుకు మాత్రమే అవకాశం ఉండేది. ఇక నుంచి విద్యాసంస్థల్లో చేరేటప్పుడే తల్లి వివరాలు కూడా సేకరిస్తారు… అది లేకుండా దరఖాస్తులను ఇక స్వీకరించరు. దీనికి సంబంధించి అన్ని వర్శిటీలకు, విద్యాసంస్థలకు విద్యార్థుల సర్టిఫికెట్లలో తల్లిపేరును నమోదు చేయాలని ఆదేశాలు పంపింది కేంద్రం.

మొత్తానికి ఈ కొత్త జీవోతో విధ్యార్దులు చాలా మంది ఆనందంగా ఉన్నారు.. ఇక స్ట‌డీ స‌ర్టిఫికెట్ల‌లో తండ్రి లేక త‌ల్లి ఇద్ద‌రు లేక‌పోయినా ఆమె గార్డియ‌న్ పేరు న‌మోదు త‌ప్ప‌నిస‌రిగా చేయాలి..