కశ్మీర్ లో భయం భయం యుద్దానికి సిద్దమంటున్న భారత్

193

ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు చరమగీతం పాడింది కేంద్రం. జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూ, కశ్మీర్‌, లద్ధాఖ్‌‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లద్ధాఖ్‌‌కు ఎలాంటి అసెంబ్లీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, అయితే జమ్మూ కాశ్మీర్ రెండుగా విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇక ఢిల్లీలాగా ఉంటుందని, ముఖ్యమంత్రి ఉంటారని, అయితే గవర్నర్ ఉండరని, గవర్నర్ జనరల్ ఉంటారన్నారు.

Image result for కశ్మీర్ లో

370 ఆర్టికల్ పేరుతో మూడు కుటుంబాలు జమ్ము కాశ్మీర్‌ను దోచుకున్నాయని అమిత్ షా విమర్శించారు. సభలో జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై పూర్తి స్థాయి చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం లేదన్నారు. జమ్మూ కాశ్మీర్ లో దళితులకు ఎందుకు రిజర్వేషన్ లేదని, గిరిజనులకు ఎందుకు రాజకీయ అధికారం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళల హక్కులను కాలరాస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఈ పరిస్దితుల్లో కశ్మీర్ లో అసలు ఏం జరుగుతుంది అని చర్చ దేశం అంతా జరుగుతోంది.

Image result for కశ్మీర్ లో

ఈ పరిణామాలు చూస్తుంటే దేశంలో మరోసారి ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అని చెప్పాలి. ఏళ్ల తరబడి నలుగుతున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు బీజేపి ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ లో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. అలానే నేడు విద్యాసంస్థలను మూసివేశారు. ఇక కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ప్రజలు శాంతంగా ఉండాలని వారికి ఓ ట్వీట్‌ ద్వారా మాజీ సీఎం ఒమర్‌ విజ్ఞప్తి చేశారు.కాని వారి ఆశలు ఆవిరి అయ్యాయి.. ఆర్టికల్ ఆర్టికల్‌ 370, 35-Aలు రద్దు అయ్యాయి, మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం కశ్మీర్ ప్రజలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఈనేఫధ్యంలో హోంమంత్రి అమిత్‌షా జాతీయ భద్రతా సలహాదారు, నిఘా, రా అధినేతలతోపాటు, సీనియర్‌ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. అమిత్‌షా కశ్మీర్‌లో పర్యటనకు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. శ్రీనగర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో అడుగడుగునా బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే అణచివేసేందుకు, కాశ్మీర్ తిరుగుబాటు దారుల నుంచి పొంచి ఉన్న ముప్పును అణచివేసేందుకు అన్నిరకాలుగా సిద్దంగా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం సంసిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Image result for కశ్మీర్ లో

జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జమ్ముకశ్మీర్ మూడు ముక్కలు చేయబోతున్నరనే వార్తలు నిన్నటి వరకూ వినిపించాయి. చివరకు వారు భావించింది జరిగింది. జమ్ము,ని రాష్ట్రంగా – లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది అదే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో కశ్మీర్ ప్రజలు చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.నిజానికి గత నెల 26తోనే పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉండగా వాటిని ఈ నెల ఏడో తరగతి వరకు పొడిగించడం, చరిత్రలో తొలిసారిగా అమర్‌నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయడం, జమ్ముకశ్మీర్‌లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం, ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం, మాజీ ముఖ్యమంత్రులను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం లాంటివి ఇందులో భాగమేనని చెప్పాల్సిందే…ఈ సమయంలో ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ యాక్టీవ్ గా ఉంటారు. అలాగే పాక్ నుంచి కూడా ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉంది అందుకే యుద్దమేఘాలు కమ్ముకున్నాయి అని చెప్పాలి, కాని ఆర్మీ మాత్రం సనాయత్తంగా ఉంది.మరి మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం పైమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.