డ్రైవింగ్ చేస్తుండగా ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్..

257

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం చాల ఎక్కువైపోయింది. అదికాక ఏది కావాలన్న ఇంటర్నెట్ లో వెతుక్కోవడము దాన్ని అనుసరించటం జరుగుతుంది. ప్రతిది ఆన్లైన్లోనే జరిగిపోతుంది.వీటన్నింటికి కావల్సినది స్మార్ట్ ఫోన్.అందుకే ఈ మొబైల్స్ వాడకం ఎక్కువ అయింది అయితే ఈ మొబైల్స్ అప్పుడప్పుడు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. మొబైల్ ఫోన్స్ పేలి ఎందరో చనిపోయారు. చేతిలో ఉండగానే పేలిపోయిన ఘటనలు మనం ఎన్నో చూశాం. ఇప్పుడు మరొక అలంటి ఘటనే జరిగింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా..

Image result for జేబులో పేలిన సెల్ ఫోన్..

చైనా ఫోన్లలోని డొల్లతనం పదేపదే బయటపడుతూనే ఉంది. సాధారణంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిపోయే సెల్ ఫోన్లు.. ఇప్పుడు పాకెట్ లో ఉండగానే పేలుతున్నాయి. ఓ యువకుడి ప్యాంట్ జేజులోనే ఫోన్ పేలిన ఉదంతం.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో నిన్న చోటు చేసుకుంది. ఆ ఫోన్ కొనుగోలు చేసి నెల రోజులు కూడా కావపోవడం గమనార్హం. రావులపాలెంకు చెందిన సూర్యకిరణ్ అనే యువకుడు రెడ్ 20 రోజుల కిందట ఎం.ఐ. నోట్ -4 సెల్ ఫోన్ కొన్నాడు. ఆదివారం దాన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఇంటి వద్ద నుంచి బైక్ పై బయలుదేరాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత కిరణ్.. తన ప్యాంట్ జేబులోంచి ఒక్కసారిగా మంటలు రావడం గమనించాడు. బండి దిగి చూసేసరికి ఫోన్ కాలిపోతూ ఉంది. వెంటనే దాన్ని తీసి బయటపడేశాడు. అప్పటికే మంటల కారణంగా అతడి తొడకు గాయాలయ్యాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

భారత్ లో ఎక్కువగా అమ్ముడవుతున్న సెల్ ఫోన్లు ఇవే కావడం గమనార్హం.అలాగే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం ,చాటింగ్ చేయడం, వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి మొబైల్ పేలి మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఎప్పుడైనా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఫొన్ మాట్లాడకూడదు. ఇలా చేయడం వ్ల ఫోన్లో ఎక్కువ రేడియేషన్స్ జనరేట్ అవుతాయి. దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.కాబట్టి మొబైల్ ఫోన్స్ తో కొంచెం జాగ్రత్త. మరి ఈ మొబైల్ ఘటన గురించి అలాగే ఇలా ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న మొబైల్ పేలుడు ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.