పాము పగబట్టడం విన్నారా, అయితే ఈ వీడియో చూడండి షాక్ అవుతారు
603
పాము పగబడుతుంది…ఇలా నిజజీవితంలో ఎక్కడ అవుతుంది? అని సిల్లీగా కొట్టిపారేస్తున్నారా!! కానీ ఓ యువకుడిని `నిన్ను వదల బొమ్మాళీ` అని ఒక పాము ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఒకటి రెండు కాదు నాలుగేళ్లుగా.. `నిను వీడని పామును నేను` అంటూ తెగ భయపెడుతోంది. దాని బారి నుంచి రక్షించిన వారికి నజరానాలు ప్రకటిస్తున్నాడు. అంతేకాదండోయ్.. బాడీగార్డులను కూడా నియమించుకున్నాడు.
Image result for snake
ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పాము నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువకుడు తంటాలు పడుతున్నాడు. షాజహాన్ పూర్ జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు 2013లో ఓ మగ పామును చంపాడట. అప్పటి నుంచి ఆ మగపాముతో జతకట్టిన ఆడ పాము అతన్ని చంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందట. పాముని చంపిన తర్వాత నుంచి ఆడ పాము తనని కిలోమీటర్ల పాటు వెంటపడిందని ఆ యువకుడు చెబుతున్నాడు. ఇప్పటివరకూ నాలుగు సార్లు తనపై పాము దాడికి యత్నించిందని తనని చంపే దాకా వదిలదని అతను భయంతో వణికిపోతున్నాడు.
\r\n
పైగా ఆ పామును చంపిన వారికి రూ.5000/- రివార్డు కూడా ఇస్తానని ప్రకటించాడు. పాము తనని ఏమీ చేయకుండా ఉండేందుకు రక్షణంగా నలుగురు గార్డులను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. అతను ఎక్కడుంటే అక్కడ ఆ గార్డులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారుల వరకూ వెళ్లింది. వారంతా దీనిని కొట్టిపారేస్తున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయని.. వాటిలో ఏదో ఒక దాన్నిచూసి తన వెంటపడిందని యువకుడు భావిస్తున్నాడని వివరిస్తున్నారు. పాము వెంటాడటం అనే మాట అతని భ్రమేనని వదిలేశారు.
Image result for snake
పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత…అది తప్పించుకుపోతే…అది మిమ్మల్ని పగబడుతుందా? మీరు కొట్టే సమయంలో ఆ పాము తన మెమొరీలో మీ ఫోటోను సేవ్ చేసుకొని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందా? అంటే… అవుననే అంటారు మన పెద్దలు. పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగపడుతుందా? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? అనే విషయాన్ని కాస్త కాన్సంట్రేషన్ ను పెట్టి పరిశీలిస్తే….ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయ్.
\r\n
నిజమేంటంటే…పాముకు అసలు మెమొరీనే ఉండదట…అలాంటప్పుడు పాము మనల్ని గుర్తు పెట్టుకునే ఛాన్స్…పగపట్టే ఛాన్స్ అసలు ఉండనే ఉండదట.! ఇదంతా మనవాళ్లు కల్పించిన ఓ నమ్మకం మాత్రమేనట.!అయితే దీని వెనుక కూడా ఓ కారణం ఉందనే అంటారు చాలామంది.
\r\n
మన దేశం లో పాము ని ఒక విష జంతువు లా కంటే కూడా ఒక దేవుడు గా చూసేవాళ్ళు చాల మందే ఉన్నారు .
Image result for snake
దానిని ఒక విష జంతులు లాగ చూడకుండా కుల దైవం లాగ నాగ దేవత లాగ చూడడం మన పూర్వికుల నుండి ఉన్న అలవాటు.అంతే కాదు మనకి పూర్వం నుండి కూడా ఒక మాట చెప్పే వాళ్ళు పాము పగ పడుతుంది జాగ్రత్త అని.
\r\n
అప్పట్లో రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయం. పండించిన పంటలకు ఎలుకల నుండి తీవ్ర నష్టం వాటిల్లేదట. కాబట్టి కనపడిన పామును కనపడినట్టు చంపడం ద్వారా…ఎలుకలను తినే పాముల సంఖ్య తగ్గడంతో…ఎలుకలు విపరీతంగా పెరగడం..
\r\n
పంటలకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లడం లాంటివి అవుతాయని..ముందస్తుగా పాములను చంపొద్దు, ఒక వేళ మిస్ అయితే అవి పగబడతాయి అనే భయాన్ని క్రియేట్ చేసారట.! పురాతాన జనాలు పాము ను దేవతగా కొలవడం, ప్రకృతి ప్రేమికులు కావడం కూడా దీని వెనుకున్న అసలు కారణాలు….ఏది ఏమైనా కాస్త జాగ్రత్త తో ఉంటె మంచిది..అత్యుత్సాహం తో మనమే దానిని చంపే ప్రయత్నం చేయకుండా వాటిని పట్టుకునే వారికి సమాచారం అందిస్తే వారు చూసుకుంటారు.
\r\n
ఈగ సినిమాలో తనను చంపిన.. విలన్ ను ముప్పుతిప్పులు పెట్టి పగ తీర్చుకున్నట్లు పాములు కూడా చేస్తాయా? అది సినిమాలో కాబట్టి.. జక్కన్న రాజమౌళి దర్శకుడు కాబట్టి అలా జరిగింది.