చాగంటి బ‌యోగ్ర‌ఫీ 1959 నుంచి ప్ర‌స్తుతం

78

ఈ రోజుల్లో ఓ వ్య‌క్తిని మార్చ‌డం అత‌నిని మంచి దారిలో న‌డిపించ‌డం అంటే చాలా క‌ష్టం, కాని త‌న మంచి మాట ప్ర‌వ‌చ‌నంతో యావ‌త్ తెలుగు జాతిని స‌న్మార్గంలో న‌డిపిస్తున్న గొప్ప గురుతుల్యులు , ప్ర‌వ‌చ‌న గురువులు శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావుగారు. సాక్షాత్తు మ‌న‌కు ఆ దైవమే వ‌చ్చి మంచిని చెప్పి స‌న్మార్గం చూపేలా ఉంటాయి ఆయ‌న ప్ర‌వ‌చ‌న సుగంధాలు. మ‌రి మ‌నిషిలో మార్పు అంటే కేవ‌లం త‌ను చేసే ప‌ని ఆలోచించే విధానం అని ఆయ‌న చెబుతారు.. అలా మ‌నిషి జీవితానికి సంబంధించి ఎన్నో ఉత్త‌మ‌మైన స‌ద్గుణాలు చెబుతూ, ప్ర‌వ‌చ‌నాల‌తో కొత్త మార్గాన్ని చూపుతున్న బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు గారి రియల్ స్టోరీ తెలుసుకుందాం.

Image result for చాగంటి

చాగంటి కోటేశ్వరరావు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన చాగంటి జన్మించారు…. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు…. ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి తెలుగువారికి అంద‌రికి తెలిసిన‌వే. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇలా లెక్క‌కు మించి స‌న్మానాలు బిరుదులను అందుకున్నారు.

Image result for చాగంటి

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, అలాగే 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకున్నారు… కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేస్తున్నారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.

Image result for చాగంటి

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో తండ్రి మ‌ర‌ణించారు.. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆయ‌న త‌ల్లి కష్ట‌పడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కుగా ఉన్నారు, ఈ స‌మ‌యంలో అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. స్కూల్ స్థాయినుంచి ఆయన బాగాచ‌దువుకునేవారు సంస్కృతం బాగా చదివేవారు. అలా చ‌దువులో ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

Image result for చాగంటి

ఆయన ధారణాశక్తి గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. అంతా ఘ‌నాపాటి. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏరోజూ కాకినాడ దాటి వెళ్లేవారు కాదు. ఏనాడూ ప్ర‌వ‌చ‌నాల‌కు డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అలా రోజు రోజుకి అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. “మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను” అన్నారు పీవీ.చాగంటి వారు నవ్వేసి “మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు.” అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు.

Related image

ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను వ‌ద‌ల‌లేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు……చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. ఆయ‌న ప్ర‌వ‌చనాలు కొన్ని చూస్తే.

Image result for చాగంటి

అన్నవరం వైభవం
అయ్యప్ప స్వామి వైభవం
అష్ట పుష్ప పూజ
ఆదిశంకరాచార్య వైభవం
ఆధ్యాత్మిక విషయాలు
ఆలయ దర్శనము
కాత్యాయని వ్రతము
కార్తీక మాస మహత్యం
కార్తీక మాస వైభవం భక్తి టీవి కోటి దీపోత్సవం
గజేంద్ర మోక్షం
భాగవత తత్త్వము
భాగవతం

ఈ క్రింద వీడియో చూడండి

చాగంటి వారికి అనేక‌మైన బిరుదులు కూడా వ‌చ్చాయి.
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ ప్ర‌ధానం చేశారు.మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారు వాచస్పతి (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు.డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ 26వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం అందజేసారు.

Image result for చాగంటి

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణిగా ఉన్నారు. చాగంటివారు ఆఫీసుకు సాధారణంగా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో ఇస్తారు. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. కానీ ప్రవచనాలకు ఆయన పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు, అంతేకాని నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఏరోజు వినియోగించుకోలేదు…అలాంటి ఓ గొప్ప వ్య‌క్తి తెలుగువారిగా ఉన్నందుకు చాలా మంది గ‌ర్విస్తున్నారు. ఆయ‌న నిండు నూరేళ్లు సంతోషంగా ఉండి ఆయురారోగ్యాల‌తో మ‌రిన్ని ప్ర‌వ‌చ‌నాలు చెప్పాల‌ని కోరుకుందాం.