తల్లిదండ్రులు, చెల్లెలిపై బీటెక్‌ విద్యార్థి కిరాతకం…వీడు వేసిన ప్లాన్ చూసి షాకైన పోలీసులు

452

ప్రతి తల్లిదండ్రులు పిల్లల మంచే కోరుకుంటారు.ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోవాలని అనుకోరు.ఒకవేళ తెలియక పిల్లలు ఏమైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తుంటారు. అవసరమైతే ఒక దెబ్బకొడతారు కూడా. అలా, తన బిడ్డ చెడు మార్గంలో ప్రయాణించడాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి తన బిడ్డను చెంపపై కొట్టాడు. అంతే అమ్మనాన్నపై కక్ష పెంచుకున్నాడు ఆ కుమారుడు.అంతేనా దీనంతటికి కారణం చెల్లెలే అని ఆమె మీద కూడా పగ తీర్చుకోవాలనుకున్నాడు. మరి ఆ కోపంతో ఏం చేశాడో తెలుసా..ఇప్పుడు పూర్తీ వివరాలతో చెబుతా వినండి.

దక్షిణ ఢిల్లీలో మిథిలేశ్‌ అనే ఇంటీరియర్‌ డిజైనర్‌ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నాడు. కొడుకు సూరజ్‌(19).. గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్‌ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. స్నేహితులతో తిరగొద్దని, వాళ్లను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరించారు.ఒక దెబ్బ కూడా కొట్టాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న సూరజ్‌ వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా తన మొబైల్‌ చెక్‌ చేస్తూ వారికి తన గురించి చాడీలు చెబుతున్న చెల్లెల్ని(16) కూడా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన సూరజ్‌ బెడ్‌రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు.హత్య చేసిన తర్వాత ఇరుగుపొరుగు వారిని పిలిచిన సూరజ్‌ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వారికి అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు. ఈ ఘటనతో ఉలికిపడ్డ పక్కింటి వారు సూరజ్‌ను సముదాయించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే సూరజ్‌ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. విచారణ జరుపుతున్న క్రమంలో హత్యకు కారణం దొంగలు కాదని తన తల్లి, చెల్లెలిని కత్తితో పొడిచింది తండ్రేనని అందుకే ఆయనను చంపానని సూరజ్‌ పోలీసులకు చెప్పాడు. కానీ మిథిలేశ్‌కు అలాంటి వాడు కాదని భార్యా పిల్లలను ప్రేమగా చూసుకునే వాడని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో సూరజ్‌ని మరోసారి లోతుగా విచారించారు. ఈ క్రమంలో కామన్‌ గేట్‌ తాళం చెవి ఆధారంగా నిందితుడు సూరజేనని కనిపెట్టగలిగారు. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.అదేమిటి అంటే..తల్లిదండ్రులు ఏం చెప్పిన మన మంచికే.వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి ఉందా చెడు ఉందా అని ఒక్కసారి ఆలోచిస్తే మనం ఏం చేస్తున్నామో మనకే తెలుస్తుంది.కాబట్టి తల్లిదండ్రులు తిట్టరానో కొట్టరానో ఇలాంటి దారుణాలకు ఎవరు పాల్పడకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.