నీ రేటెంత…ఎక్కడ కలవాలి… ఏ సమయంలో..?

567

మన పెద్దలు. దేవుడి తర్వాత గురువుకు అంతటి స్థానం కల్పించారు. అలాంటిది గురువుల వద్ద విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి తనపై కోపగించున్నారన్న కారణంతో మహిళా గురువు ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్లో పెట్టి ఆమెను మానసిక వేదనకు గురిచేశాడు. మహిళా గురువు ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వేరే బ్రాంచికి చెందిన అతడి ఫ్రెండ్ ఆస్తమా కారణంగా ఊపిరి ఆడక క్లాస్ రూంలో పడిపోయాడు.

Image result for beauty full girls images

దీంతో సదరు విద్యార్థి అతణ్ని చూసేందుకు అక్కడికి వెళ్లాడు. కింద పడిపోయిన విద్యార్థి ప్రథమ చికిత్సతో కాసేపటి తర్వాత కోలుకున్నాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న అతడి ఫ్రెండ్స్ గ్యాంగ్.. అక్కడే పిచ్చాపాటి కబుర్లు మొదలుపెట్టింది. పెద్దగా మాట్లాడుతూ ఇబ్బంది కలిగించింది. అతడు కోలుకున్నాడు కదా.. మీరంతా ఇక్కడి నుంచి వెళ్లండని అసిస్టెంట్ ఫ్రెఫొసర్‌గా పని చేస్తున్న బాధితురాలు సూచించారు. కానీ అక్కడికి వెళ్లిన స్టూడెంట్, అతడి ఫ్రెండ్స్.. ఆమెతో గొడవకు దిగారు.

Image result for beauty full girls images

ఆ టైంలో ఆమెపై సదరు విద్యార్థి పగ పెంచుకున్నాడు. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ నుంచి ఫోటో డౌన్‌లోడ్ చేసి.. ఫోన్ నంబర్‌ను లోకంటో అనే వెబ్‌సైట్లో ఉంచాడు. ‘నాతో సెక్స్ చాట్ చేస్తారా.. రూ.1200 ఖర్చవుతుంది. నగ్న ఫొటోలు కావాలంటే రూ.200, సెక్స్‌లో పాల్గొనంటే రూ.5000 ఖర్చవుతుంది. కాల్ మీ సెక్సీ బాయ్స్..’అంటూ నోటికొచ్చినట్టు రాసుకొచ్చాడు. దీంతో ఆమెకు రోజు పదుల సంఖ్యలో అసభ్యకరమైన మెసేజ్‌లు ఫోన్ కాల్స్ ఎక్కువైయిపోయినాయి.పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఫోన్‌లు రావడం మొదలయ్యాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నీ రేటెంత… ఎక్కడ కలవాలి… ఏ సమయంలో? అంటూ ఆమెతో అసభ్యంగా మాట్లాడటంతో మానసిక క్షోభకు గురైంది.భరించలేక రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. పక్కా ఆధారాలతో అతడిని పట్టుకొని విచారించగా.. ఇదంతా చేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని జైల్ కు పంపారు.