నడిరోడ్డుపై కిరాతకం..సొంత చెల్లిని నరికి చంపిన అన్న..ఎందుకో తెలిస్తే షాక్

331

మాయమయిపోతున్నాడమ్మా మనిషన్న వాడు అని ఒక మహాకవి అన్నాడు.ఇది అక్షరాలా నిజం.రానురాను మనిషన్న వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు.డబ్బు అనే దానికి దాసోహం అయ్యి అతికిరాతక పనులు చేస్తున్నాడు.వాయివరసాలు మరచి మరి దారుణాలకు పాల్పడుతున్నాడు.డబ్బు కోసం చంపడానికి సిద్ధమయ్యేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు.కానీ సొంతవాళ్లను ఎవరైనా దూరం చేసుకుంటారా..చేసుకోడు కదా కానీ ప్రస్తుతం అలాంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లెల్లు అక్క అన్న వరుసలు కూడా చూడకుండా డబ్బు కోసం చంపేసే స్థితికి వచ్చాడు మనిషన్నవాడు.ఇప్పుడు ఆస్తి తగాదాలు ఒక ఆడ కూతురి ప్రాణాలు బలితీసుకున్నాయి.అన్నయ్యే చెల్లెలిని నడిరోడ్డుపై నరికేశాడు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందాం.

ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృష్ణమూర్తి, రాజారావు అన్నదమ్ములు. పెద్దవాడైన రాధాకృష్ణకు నలుగురు కుమార్తెలు. రాజారావుకు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణకు చెందిన ఎకరం పొలం విషయంలో రాజారావు కుమారుడు సింగయ్యతో వివాదం నడుస్తోంది. పొలం తనకే అమ్మాలని సింగయ్య(40) పట్టుబట్టగా రాధాకృష్ణ ససేమిరా అన్నాడు. దీంతో కక్ష పెంచుకున్న సింగయ్య ఆ పొలాన్ని ఎవరూ కొనకుండా చానాళ్లు అడ్డుపడ్డాడు. ఇదేకాక గతంలో ఇంటిదగ్గర మురుగునీరు విషయంలోనూ రాధాకృష్ణ నాలుగో కుమార్తె పద్మావతి (28), సింగయ్య మధ్య తీవ్ర గొడవ జరిగింది. అయితే ఇటీవల తన పొలాన్ని ఎలా గోలా అమ్ముకున్న రాధాకృష్ణ ఆ సొమ్ముతో ఆరు నెలల క్రితం కుమార్తె పద్మావతిని పెళ్లి చేశారు. ఆమె భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది.

పద్మావతి సోషల్‌ వర్క్‌లో పీజీ చేసింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ప్రభుత్వ అధికారుల ప్రశంసలు పొందింది. మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులో అవార్డు స్వీకరించాల్సి ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆమె మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒంగోలు వెళ్లేందుకు స్వర్ణలో బస్‌షెల్టర్‌ వద్దకు వస్తుండగా అక్కడే మాటు వేసిన సింగయ్య ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. చాతీకింద, మెడపైన సుమారు 10 చోట్ల ఆమెను కిరాతకంగా నరికాడు. దీంతో పద్మావతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పారిపోయేందుకు యత్నించిన సింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చూశారుగా అన్నయ్యే ఆమె పాలిట యముడిలా ఎలా అయ్యాడో.ఇక్కడ అందరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది.పుట్టినప్పుడు ఏమి తీసుకురాము వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళం.అలాంటప్పుడు ఈ చంపడాలు ఎందుకు చెప్పండి.ఆలోచించి ఇలాంటి దారుణాలకు ఇక ఎవరు పాల్పడరని అనుకుంటున్నాం.