పెళ్లి చేసుకున్న భర్త చెయ్యి మీద వేరే అమ్మాయి పేరు పచ్చబొట్టు ఉందని ఈ నవవధువు ఏం చేసిందో తెలిస్తే షాక్..

1532

పెళ్ళికి ముందు ప్రేమలో పడడం సహజం.ప్రేమిచిన వారినే పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు కానీ చాలా మంది ప్రేమించేది ఒకరిని పెళ్లి చేసుకునేది ఇంకొకరిని.పెళ్ళైన తర్వాత మనకు వచ్చే భార్యకానీ భర్త కానీ మంచోలు అయితే ఎలాంటి సమస్య ఉండదు కానీ సైకో భర్తలు శాడిస్ట్ భార్యలు వస్తేనే అసలు సమస్య.ఇలాంటి సమస్య ఒక వ్యక్తికి వచ్చింది.పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు.అయితే పెళ్ళైన తర్వాత ఆ విషయం భార్యకు తెలిసింది.మరీ ఆ విషయం తెలుసుకున్న భార్య ఇప్పుడు ఏం చేసింది అనేదే ఇక్కడ మ్యాటర్.మరి ఆ భార్య అర్థం చేసుకుందా లేక అతనిని శిక్షించిందా..ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for couples in temple

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలో నివసించే రాజు అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు.ఆ అమ్మాయి కూడా ఇతనిని లవ్ చేసింది.ఇద్దరు ఎంచక్కా ఎంజాయ్ చేశారు.చివరికి ఒకరి పేర్లు ఇంకొకరు పచ్చబొట్టు వేపించుకున్నారు.అంతలా లవ్ చేసుకున్నారు.కానీ ఏమైందో ఏమో ఇద్దరు విడిపోయారు.ఇక అతను ఆ తర్వాత మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్ళైన ఐదు రోజుల తర్వాత ఈ ఇద్దరు భార్యాభర్తలు సాయిబాబా దర్శనం కోసం గుడికి వెళ్ళారు.దర్శనం అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. భవిష్యత్తు గురించి ఊసులాడుకున్నారు. చేతిలో చెయ్యి వేసుకుని చాలాసేపు కబుర్లాడుకున్నారు. అలా మాట్లాడుతుండగానే.. భర్త చేతిపై ఉన్న పచ్చబొట్టుపై నవ వధువు దృష్టి పడింది. పరిశీలించి చూస్తే అదో అమ్మాయి పేరు.

Image result for wife slaps husband

అంతే భార్య అపర కాళి అయ్యింది. ఆలయమని కూడా చూడకుండా శివమెత్తింది. ఆమె ఎవరంటూ ప్రశ్నించింది. సమాధానం చెప్పేందుకు భర్త తటపటాయిస్తుండడంతో జుట్టు పట్టుకుని చెంపలు చెడామడా వాయించింది. కాళ్లతో తంతూ, వీపుపై పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చుకెళ్లింది. దీంతో ఆలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దర్శనానికి వచ్చిన మిగతా భక్తులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఊరుకోలేదు. ఆమె ఎవరో చెప్పాలంటూ భర్తను చెడుగుడు ఆడుకుంది.భర్తను ఆమె కొడుతుండగా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

చూశారుగా మొగుడి చేతి మీద ఎవరో అమ్మాయి పేరు పచ్చబొట్టు ఉందని ఈ నవ వధువు తన భర్తను ఎంత దారుణంగా కొట్టిందో.మీరు కూడా ఎవరినైనా లవ్ చేస్తూనే ఇలా పచ్చబొట్టు లాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యకండి.ఎందుకంటే భవిష్యత్ లో మీకు వేరే అమ్మాయితో పెళ్లి అయితే మీకు కూడా ఇలాంటి పరిస్థితే రావొచ్చు.మరీ ఈ సంఘటన గురించి అలాగే ఇలాంటి అపరకాళీ భార్యల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.