Breaking News: విమానం కూలి 14 మంది మృతి

186

ఇటీవ‌ల విమాన ప్ర‌మాణాలు ప‌లు దేశాల‌ను కుంగ‌దీస్తున్నాయి మ‌లేషియ‌న్ విమానం కూలిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ర‌ష్యా నుంచి వెళ్లిన విమానం కూలింది ఇలా ప‌లు విమానాలు ప్ర‌మాదాల‌కు గురి అవ‌డంతో ప్రాణాలు గాలిలోనే క‌లిసిపోతున్నాయి ఈ స‌మ‌యంలో చాలా మంది విమాన ప్ర‌యాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మ‌రో విషాదం విమాన ప్ర‌మాదంలో జ‌రిగింది.

Image result for airplane crash

కొలంబియా దేశంలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న చిన్న విమానం కూలి 14 మంది మృతిచెందారు. 30 సీట్ల సామర్ధ్యం గల డగ్లస్‌ డీసీ-3 విమానం విల్లావిసెన్కో నుంచి బ్రెజిల్ సరిహద్దు సమీపంలోని టరైరాకు వెళ్తోంది. 120 కిలోమీటర్ల ఈ మార్గంలో 85 కిలోమీటర్లు ప్రయాణించిన విమానం శాన్‌జోస్‌ డెల్‌ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు.. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారని, మృతులను ఇంకా గుర్తుపట్టాల్సి ఉందని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెలిపోయాయని, కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుపోవడంతో అందరూ ప్రాణాలు కోల్పోయారని కొలంబియా అధికారులు తెలిపారు. విమానం కూలడానికి కారణం ఇంకా తెలియనప్పటికీ, ఇంజిన్ వైఫల్యమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో ఇద్ద‌రు పిల్లులు ఉన్నారు అని తెలుస్తోంది, ఈ ప్ర‌మాదంపై స్ధానిక మీడియాలో వార్త‌లు రావ‌డంతో ఒక్క‌సారిగా ఆ కుటుంబం స‌భ్యులు షాక్ అయి విమానాశ్ర‌యానికి చేరుకున్నారు అక్క‌డ అధికారుల వ‌ద్ద వారి వివ‌రాలు ఇచ్చి తమవారి గురించి అడుగుతున్నారు, మొత్తానికి ఈ దారుణ‌మైన ప్ర‌మాదంతో అక్క‌డ విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.