Breaking News : పార్టీ కార్యాలయంలో యువతిపై రేప్.. ఏ పార్టీ నాయకుడు చేశాడో తెలిస్తే షాక్.

332

సమాజంలో ఆడపిల్ల ఒంటరిగా ఉంటె చాలు ఆమె మీద అత్యాచారం చెయ్యాలని చూసే మగాళ్లు అడుగడునా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవర్ని అత్యచారం చేస్తాడో తెలియదు కాబట్టి ఆ మృగాళ్ల బారి నుంచి అమ్మాయిలను కాపాడలేకపోతున్నారు. పోలీసులు ఎంత భద్రత కల్పించిన కూడా ఈ అత్యాచారాలను ఆపలేకపోతున్నారు.మాములు ప్రజలు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్రజలను కాపాడాల్సిన వాళ్ళే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.ఇప్పుడు ఒక పార్టీకి చెందిన అగ్రనేతనే ఒక యువతిని అత్యాచారం చేశాడు. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls harassment

పార్టీ కార్యాలయంలోనే ఓ విద్యార్థి సంఘం నేత తనను అత్యాచారం చేశారంటూ యువతి చేసిన ఆరోపణలు కేరళలో దుమారం రేపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో అధికార సీపీఎం పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పాలక్కడ్ జిల్లా చెరుప్లాసరీ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో 10 నెలల కిందట తనపై ఈ దారుణం జరిగిందని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. దుర్మార్గుడి పాపానికి తనకు బిడ్డ జన్మించిందని పోలీసులతో గోడు వెల్లబోసుకుంది. గత శనివారం రాత్రి రోడ్డు పక్కన అప్పుడే పుట్టిన శిశువు రోదనలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని శిశువును సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత చాలా శ్రమించి చిన్నారి తల్లిని గుర్తించారు. శిశువును వదిలేయడానికి కారణాలేమిటని ఆరా తీస్తున్న క్రమంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విచారణలో బాధితురాలు సంచలన వివరాలను తెలిపింది. 10 నెలల కిందట సీపీఎం ఆఫీసులో తనపై రేప్ జరిగిందని చెప్పింది. కాలేజీ మ్యాగజైన్ పని మీద అక్కడికి వెళ్లగా ఓ విద్యార్థి సంఘం నేత బంధించి అత్యాచారం చేశాడని వెల్లడించింది. ఆమె వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

లోక్‌సభ ఎన్నికల వేళ ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. అధికార సీపీఎం పార్టీపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎల్‌డీఎఫ్ పాలనలో మహిళలకు కనీస రక్షణ లేకుండాపోయిందని మండిపడుతున్నారు. సాక్షాత్తు పార్టీ కార్యాలయంలోనే రేప్‌లు జరుగుతున్నాయంటే.. వామక్షాల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా కనిపిస్తోందని సీపీఎం ఎంపీ ఎంబీ రాజేశ్ ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను బహిర్గతం చేయాలని కోరారు. ఆ యువతి కుటుంబ సభ్యులు తమ పార్టీకి చెందిన వారేనని, ఆమె కూడా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తేనని స్థానిక సీపీఎం నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీ కూడా దీనిపై విచారణ జరుపుతుందన్నారు. ప్రస్తుతం బాధితురాలు, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఈ యువతికి జరిగిన అన్యాయం గురించి అలాగే ఆడపిల్లల మీద పడి వారి జీవితాలను నాశనం చేస్తున్న కామాంధుల ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.