బ్రేకింగ్ న్యూస్: మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం నిలిపివేత.. షాక్ లో అమృత

485

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.త్వరలోనే వీరికి శిక్ష వేయనున్నారు.అయితే ఇప్పుడు మిర్యాలగూడలో ఒక అంశం మీద పెద్ద చర్చనే నడుస్తుంది.అదేమిటి అంటే ప్రణయ్ కు విగ్రహం పెట్టాలని కొందరు పెట్టవద్దని కొందరు అంటున్నారు.అయితే ఈ విషయం మీద ఇప్పుడు అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు.మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకుందామా.

Image result for pranya and amrutha

మిర్యాలగూడలో పరువు కత్తికి బలైన ప్రణయ్ విగ్రహం చుట్టూ వివాదం ముదురుతోంది. పట్టణం నడిబొడ్డున తెలంగాణ చౌరాస్తాగా పిలిచే శకుంతల థియేటర్ సెంటర్‌లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు కూడా ప్రారంభించాయి. దళిత సంఘాలు సాగర్ రోడ్డు లో గుంతలు తవ్వి ఇనుపచువ్వలు కూడా పెట్టారు.దీని పని కూడా మొదలుపెట్టారు.ఏకంగా ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను కూడా తొలగించారు.అయితే ప్రధాన రహదారి మీద ప్రణయ్ విగ్రహం ఏంటని కొందరు వ్యతిరేకిస్తున్నారు.ముఖ్యంగా మిర్యాలగూడకు చెందిన దళితేతర వర్గాలు ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక పేరుతో మిర్యాలగూడకు చెందిన కొంత మంది ఓ సంఘంగా ఏర్పడ్డారు.

Image result for pranya and amrutha

రెండు కుటుంబాల మధ్య గొడవను సమాజానికి ఆపాదించవద్దని, కావాలంటే ప్రణయ్ ఇంటి వద్దే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. పట్టణ ప్రధాన కూడలిలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఏం సంకేతం ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేస్తున్నారు.ప్రణయ్ విగ్రహం వ్యవహరంలో రెండు వర్గాలు రోడ్డు ఎక్కడంతో మిర్యాలగూడలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.ప్రణయ్‌ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది రెండు కుటుంబాల మధ్యలో జరిగిన సమస్య అని, దీన్ని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సరికాదని అన్నారు.ప్రభుత్వ భూముల్లో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు సరికాదని తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు అంటున్నారు.

అనుమతులు లేకుండా నిర్మిస్తున్న విగ్రహాన్ని నిలిపివేయాలని తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక కోరింది.ఈ అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి ప్రణయ్ విగ్రహాన్ని నగరంలో పెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు.దీంతో ప్రణయ్ విగ్రహ ఏర్పాటు నిలిపేశారు.అయితే ప్రణయ్ విగ్రహం నిలిపివేత మీద దళిత సంఘాలు ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర నిరసనను తెలియజేశారు.మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు అంటున్నారు.చూడాలి మరి ఈ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటులో ఇంకా ఎన్నెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రణయ్ కు విగ్రహం పెట్టాలా..అసలేం ఘనకార్యం చేశాడని పెట్టాలి అని అంటున్న కొందరి వాదన మీద మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.