Breaking News : కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్

296

దేశం మొత్తం మీద ఇప్పుడు ఒకదాని గురించే చర్చ జరుగుతుంది. అదే పుల్వామాలో ఉగ్రదాడి. ఒకరు కాదు ఇద్దరు కాదు 44 మందిని పొట్టనపెట్టుకుంది ఈ ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్ అత్యంత సున్నితమైన రాష్ట్రమనే విషయం తెలిసనప్పటికీ, ఉగ్రవాదుల కార్యకలాపాలు మితిమీరినట్లు తెలిసినప్పటికీ.. నిఘా విభాగం గానీ, జాతీయ భద్రత ఏజెన్సీ గానీ ఏం చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ రహదారి మీద, 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్ పై పట్టపగలు ఉగ్రవాదులు దాడులు చేయాల్సిన పరిస్థితి ఎలా ఉత్పన్నమైందనే సందేహాలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా ఉగ్రవాదులు నిద్రాణంగా ఉన్న నేపథ్యంలో.. ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉందని అంటూ నివేదికలు వచ్చిన తరువాత కూడా పట్టించుకోలేదనే విమర్శలకు తావిచ్చినట్టయింది.

Image result for pulwama

అయితే ఈ దాడి తరువాత ఇండియన్ ఆర్మీ చాలా ఆవేశంగా ఉంది. సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అని ఇండియన్ ఆర్మీ అంటుంది. పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

జమ్మూ కాశ్మీర్ లో ఆరుగురు ఏర్పాటువాద నేతలకు కల్పిస్తున్న సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. ఏర్పాటువాదల ఉపసంహరణ మంచి నిర్ణయమని మాజీ సైనికులు అంటున్నారు. ఈ నిర్ణయాని ముందుగా తీసుకుంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ ఆందోళనతో రగిలిపోతుంది. దొంగ దాడితో జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు వారికి సహకరించిన పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని అక్కడ యువత నిలదీస్తుంది.చూడాలి మరి గవర్నమెంట్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. మరి ఈ ఉగ్రదాడి గురించి అలాగే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.