BREAKING NEWS భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర

132

వంట గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త తెలిపింది. సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ఐవోసీ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడంతో గ్యాస్ ధరను తగ్గిస్తున్నట్లు తెలిపింది.

LPG price cut by ₹100.

సబ్సిడీలేని ఎల్పీజీ ధర ప్రస్తుతం రూ.737.50గా ఉండగా… అది ఇవాళ్టి నుంచి రూ.637కు లభించనుంది. ఇక సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.494.35 కాగా, వినియోగదారులు ఒకసారి ఎల్పీజీ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీగా చెల్లించే రూ.142.65 ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. ఈరోజు నుంచి తగ్గిన గ్యాస్ ధరలు అమల్లోకి రానున్నాయి. 

ఈ క్రింది వీడియో చూడండి