Breaking News : భారీగా పెరిగిన బంగారం.. ఎంతనో తెలిస్తే షాక్..

268

బంగారం ఆభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. అనాదిగా వస్తూనే ఉంది. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్లు వచ్చినా కొనడానికి రెడీ అవుతారు. నిత్యం ప్ర‌ముఖ న‌గ‌రాల్లో క్వింటాళ్ల‌ కొద్దీ బంగారం వ్యాపారం జ‌రుగుతూ ఉంటుంది. అయితే సామాన్యులు బంగారం కొనేట‌ప్పుడు వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌డం ముఖ్యం. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ ఉన్న బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి.. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.

Image result for GOLD

పసిడి ధర పెరిగింది. దేశీ మార్కెట్‌లో వరుసగా రెండు రోజులుగా పడుతూ వచ్చని బంగారం ధర సోమవారం పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,200కు చేరింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. పెళ్లిళ్ల సీజన్ సానుకూల ప్రభావం చూపింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. కేజీ వెండి ధర రూ.40,100 వద్దే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు కారణం. సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అందుకోవడానికి దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు బంగారంపై పాజిటివ్ ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1,283.40 డాలర్లకు చేరింది. అయితే వెండి ధర మాత్రం ఔన్స్‌కు 15.39 డాలర్లకు తగ్గింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,200కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,050కు పెరిగింది. కాగా బంగారం ధర గత రెండు సెషన్లలో రూ.140 మేర తగ్గింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.25,500ల వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర స్థిరంగా రూ.40,100 వద్ద కొనసాగితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.58 తగ్గుదలతో రూ.39,140కి క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000 ఉండగా.. అమ్మకం ధర రూ.78,000గా స్థిరంగా కొనసాగాయి.హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,532 కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,982 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర గత ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.100 పెరిగి రూ.41,400 వద్ద కొనసాగుతోంది. విశాఖ ప‌ట్నం 30,975 ,32,525 , బెంగళూరు 30,354 , 31,844 గా ఉంది. చెన్నైలో 30,942 , 32,492 గా ఉంది.. చూశారుగా వివిధ నగరాలలో బంగారం రేట్ ఎలా ఉందొ. మరి మార్కెట్ లో ఉన్న బంగారం వెండి దరల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.