భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు ధర తెలిస్తే షాక్

181

బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజే.ఆడవాళ్లకు అయితే మరి ఎక్కువగానే ఉంటుంది.అందుకే చేతిలో డబ్బు ఉంటె చాలు బంగారం కొనాలనుకుంటారు.ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నారు. మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఆదివారం పడిపోయింది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ఎలా ఉందొ తెలుసుకుందామా.

Image result for gold

కేజీ వెండి ధర రూ.300 తగ్గుదలతో రూ.38,100కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.640 తగ్గుదలతో రూ.36,800కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇకపోతే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,050కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,480కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.40,100కు దిగొచ్చింది. ఇక విజయవాడలో 31,497 , 33,107, విశాఖ ప‌ట్నం 31,525 , 33,095 , బెంగళూరు 30,953 , 32,493 గా ఉంది. చెన్నైలో 31,499 , 33,109 గా కొనసాగుతున్నాయి…

Related image

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.33,720కు క్షీణించింది. బలమైన అంతర్జాతీయ ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయంగా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.300 తగ్గుదలతో రూ.38,100కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ఇందుకు కారణం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,345.35 డాలర్లకు చేరింది.

ఈ క్రింది వీడియో చూడండి

వెండి ధర ఔన్స్‌కు 0.34 శాతం తగ్గుదలతో 14.84 డాలర్లకు క్షీణించింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.33,720కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.33,550కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.26,800కు చేరింది. చూశారుగా వివిధ నగరాలలో బంగారం రేట్ ఎలా ఉందొ. మరి మార్కెట్ లో ఉన్న బంగారం వెండి దరల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.