BREAKING NEWS- భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ప‌దిగ్రాముల ధ‌ర తెలిస్తే షాక్

316

కొత్త సంవ‌త్స‌రం స్టార్టింగ్ లోనే బంగార ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి.. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున రూ.200 పెరిగిన బంగారం ధర.. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో రెండో రోజైన 30 పెరిగింది. తాజా పెంపుతో రెండు రోజుల్లో బంగారం ధర రూ.230 పెరిగినట్లయింది. పసిడి ధర పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.32,500 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర రూ.100 పెరిగి రూ.39,350కి చేరింది. ఇక గ‌త నెల‌లో వెండికి డిమాండ్ లేదు కానీ ఈ ఏడాది ఒక్క‌సారిగా రెండు రోజుల్లో వెండి అమాంతం పెరిగింది.

Image result for gold
బంగారం ధర తాజా పెరుగుదలతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,500 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,350 వద్ద స్థిరపడింది. ఇక సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.25,200 గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.100 పెరిగి రూ.39,350 కి చేరింది. వారాంతపు ఆధారిత డెలివరీ వెండి ధర కూడా రూ.23 పెరిగి రూ.38,748 కి చేరింది. వెండి నాణేల ధరలో ఎటువంటి మార్పులేదు. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.76,000 వద్ద, అమ్మకం ధర రూ.77,000 వద్ద నిలకడగా ఉన్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతర్జాతీయంగా చూస్తే.. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,286.57 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి 15.45 డాలర్లకు చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,700 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,210 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర కిలోకు రూ.4,140 వద్ద కొనసాగుతోంది. మ‌రి మొత్తానికి కొత్త ఏడాదిలో మ‌ళ్లీ బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఇంకెంత ఈ ధ‌ర‌లు పెరుగుతాయి అని చూస్తున్నారు.