Breaking News : వరసగా మూడోరోజు పెరిగిన బంగారం ధరలు.. ధరలు ఎలా ఉన్నాయో చూస్తే షాక్..

271

బంగారం ఆభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. అనాదిగా వస్తూనే ఉంది. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్లు వచ్చినా కొనడానికి రెడీ అవుతారు. నిత్యం ప్ర‌ముఖ న‌గ‌రాల్లో క్వింటాళ్ల‌ కొద్దీ బంగారం వ్యాపారం జ‌రుగుతూ ఉంటుంది. అయితే సామాన్యులు బంగారం కొనేట‌ప్పుడు వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌డం ముఖ్యం. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ ఉన్న బంగారం గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉంది… అయితే ఈ రోజు మళ్ళి బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి.. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.

Image result for GOLD

బంగారం ధరలు వరుసగా మూడోరోజు కూడా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.32,500 కి చేరింది. మంగళవారం బంగారం ధరలు రూ.125 పెరిగిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం (రూ.175) పెరుగుదలతో కలిపితే మూడు రోజుల్లోనే బంగారం ధర రూ.400 పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధర రూ.125 పెరిగి రూ.38,000 నుంచి రూ.38,125 కి చేరింది. పసిడి ధర పెరగడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.32,275 నుంచి రూ.32,400కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.32,125 నుంచి రూ.32,250 వద్ద ముగిసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర ఫ్లాట్‌గా రూ.25,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.38,125 కి చేరగా.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.140 పెరిగి రూ.37,681 కి చేరింది. మరోవైపు 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొనుగోలు ధర రూ.74,000 ఉండగా.. అమ్మకం ధర రూ.75,000 వద్దే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.31,270 నుంచి రూ.31,570 కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.29,740 నుంచి రూ.30,070 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర గత ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.100 పెరిగి రూ.41,400 వద్ద కొనసాగుతోంది. విశాఖ ప‌ట్నం 30,110 , 31,640 , బెంగళూరు 29,441 ,30,901 గా ఉంది. చెన్నైలో 30,120 , 31,600 గా ఉంది.అంతర్జాతీయంగాను బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్‌లో 0.31 శాతం పెరిగిన ఔన్సు బంగాం ధర 1,273.90 డాలర్లకు చేరింది. వెండి ధర కూడా 0.68 శాతం పెరిగి ఔన్స్ $ 14.94 కు చేరుకుంది..చూశారుగా మార్కెట్ లో బంగారం రేట్ ఎంత తగ్గిందో. ఈరోజు రేట్లు వివిధ నగరాలలో ఎలా ఉందొ. మరి మార్కెట్ లో ఉన్న బంగారం వెండి దరల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.