BREAKING NEWS ప్ర‌ముఖ క్రికెట‌ర్ మృతి షాక్ లో క్రికెట్ అభిమానులు

285

ఆసీస్ మాజీ స్పిన్ బౌలర్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కోచ్ బ్రూస్ యార్డ్లీ బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మిడ్‌లాండ్‌లో జన్మించిన యార్డ్లీ తొలుత మీడియం పేసర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. 27 సంవత్సరాల వయస్సులో ఆయన పూర్తిగా ఆఫ్ స్పిన్నర్‌గా మారారు. 1966లో క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన ఆయన ఆ మ్యాచ్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీశారు. ఆ తర్వాత దాదాపు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ కోసం ఆయన నాలుగు సంవత్సరాలు ఎదురుచూశారు.

1977-78లో ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 25.13 ఎకానమీతో ఆయన 15 వికెట్లు తీశారు. తన మొత్తం కెరీర్‌లో ఆయన 978 పరుగులు చేసి 126 వికెట్లు తీశారు. రిటైర్‌మెంట్ తర్వాత 1996 నుంచి 1998 వరకూ శ్రీలంక క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. యార్డ్లీ మృతిపై క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం వ్యక్తం చేసింది. ‘‘ఆస్ట్రేలియా క్రికెట్‌కి బ్రూస్ ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్‌కి చాలా సేవలు అందించారు’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇక సీనియ‌ర్ క్రీడాకారులు అలాగే ప‌లు దేశాల క్రీడాకారులు ఆయ‌న మృతిప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు ఆయ‌న క్రికెట్ లో ముఖ్యంగా బౌలింగ్ లో ఎంద‌రికో ఇన్సిపిరేష‌న్ అని త‌ల‌చుకున్నారు అభిమానులు, మీరు కూడా ఆయ‌న ఆత్మ‌కు శాంతి కల‌గాలి అని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.