Breaking News : చినజీయర్ స్వామికి ప్రమాదం

312

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రిక అయినా తెలిసిన వ్య‌క్తి , చీకటిని జయించి వెలుగులు నింపే పండుగైన దీపావళి రోజున రాజమండ్రి సమీపంలోని అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యులు గార్లకి శ్రీమన్నారాయణాచార్యులుగా జన్మించారు. ఈ సమీపంలోని గౌతమ విద్యాపీఠంలో స్వామి వేద గ్రంథముల మరియు వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు… తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద అభ్యసించారు. ఆయ‌న 23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖములను త్యజించి సన్యాసిగా మారతానని ప్రమాణం చేసారు, దీని పర్యవసానంగా జీయర్ అయ్యారు.

Image result for చినజీయర్ స్వామి

త్రిదండి చినజీయర్ స్వామి ఎక్క‌డ పూజ‌లు జ‌రిగినా పండితుడిగా ఆయ‌న హాజ‌రుఅవుతారు, ఆయ‌న‌కు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో భ‌క్తులు కూడాఉన్నారు.. ఇటీవ‌ల ఆయ‌న పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అని తెలుస్తోంది… వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దిల్‌షుఖ్‌నగర్ – ఎల్బీనగర్ రోడ్డులోని కొత్తపేటలో గల అష్టలక్ష్మి ఆలయంలో గోపురానికి పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.

Image result for చినజీయర్ స్వామి

భవన నిర్మాణంలో ఉపయోగించే గోవ కట్టె (కార్మికులు పైకి ఎక్కి దిగడానికి వీలుగా కర్రలతో ఏర్పాటు చేసుకునేది) మీద నిలబడిన సమయంలో.. అది ఒక్కసారిగా ఒరిగినట్లైంది. దీంతో పూజ సామాను తదితర వస్తువులు కిందకు జారిపడ్డాయి. ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ అయ్యారు.. స్వామి పైనుంచి జారిప‌డ‌తారు అని అంద‌రూ అనుకున్నారు, కాని దేవుని ద‌య వ‌ల్ల ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.

ఆ సమయంలో చినజీయర్ స్వామి తదితరులకు పట్టు దొరకడంతో ప్రమాదం తప్పినట్లైంది. మంగళవారం జరిగిన ఘటన గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చినజీయర్ స్వామి భక్తులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమీ కాలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇక స్వామి సేఫ్ గానే ఉన్నారు అని చిన్న గాయం కూడా జ‌రుగ‌కుండా అక్క‌డ పూజ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు అని ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అని ఆయ‌న శిష్యులు తెలియ‌చేశారు.