Breaking News : విజయవాడలో బయట పడ్డ కాల్ గర్ల్స్ మోసం

638

మోడళ్ల మోజులో ఉన్న యువత ఆత్రుతను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఎస్కార్టు, బాడీగార్డులు రకరకాల పేర్లతో నకిలీ వెబ్సైట్లను ఇంటర్నెట్లోకి వదులుతున్నారు. వాటి ముసుగులో లక్షలాది రూపాయలను లాగేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలను వెబ్సైట్లలో అప్లోడ్ చేసి యువతకు ఎర వేస్తున్నారు. ఉపాధి, విద్య నిమిత్తం విజయవాడలో బ్యాచ్లర్ జీవితాన్ని గడుపుతున్న వారంతా ఈ శృంగార వెబ్సైట్లలోకి వెళ్లి ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. పైన పేర్కొన విధంగా యువత మోసపోతోంది.ఇప్పుడు విజయవాడలో ఇలాంటి నేరగాళ్ల బాగోతం బయటపడింది.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామం.

Related image

‘ఆకర్షణీయమైన వేతనం, విలాసవంతమైన జీవితం రెండూ ఒకేచోట లభిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఓ అందమైన మోడల్కు ఎస్కార్ట్గా ఉండడమే.’ తాజాగా విజయవాడ నగరంలో హల్చల్ చేస్తున్న ప్రకటన. ఇంటర్నెట్ ఎస్కార్ట్స్ వెబ్సైట్ను చూసి ఇదేదో బాగుందని సంప్రదించిన వారికి ఊహించని ఝలక్లు తగిలాయి. మోసం పోతున్నామనే అనుమానం యువకుల్లో ఎక్కడా కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో కొంత, ఇంటర్వ్యూ పేరుతో మరికొంత, ట్రైనింగ్ క్యాంపు పేరుతో ఇంకొంత ఇలా అన్ని దశల్లోనూ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయిచుకుంటున్నారు. టార్గెట్ పూర్తయిన తర్వాత సంపద్రింపులు చేసిన సెల్నంబర్లు ఉలకవు పలకవు. హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో ఎస్కార్ట్స్, బాడీగార్డ్స్ పేరున జరిగిన ఇంటర్వ్యూలకు వెళ్లి చేతులు కాల్చుతున్నారు. రూ.40-50వేలను దశల వారీగా లాగేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు దుకాణం మూసేశారు. మరికొంతమంది నుంచి రూ.70-80 వేలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని వెబ్సైట్లలో లక్షలు పోగొట్టుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శృంగార కోరికల అడ్డా, దేశీబాయ్, ఫుల్జాయ్, ఓన్లీ ఫర్ గర్ల్స్, త్రిపుల్ ఎక్స్…. ఇవన్నీ కంపెనీల పేర్లు అనుకుంటే పొరపాటే. యువతను అప్డేట్స్తో ఉర్రూతలూగిస్తున్న వాట్సాప్ గ్రూపుల పేరులు ఇవి. ఎవరి నుంచైనా ఈ గ్రూపుల లింక్లు వస్తే చాలు విద్యార్థులు, యువతులు వెంటనే అందులో చేరిపోతున్నారు. అసభ్యకర వెబ్సైట్లను బ్లాక్ చేసిన నేపథ్యంలో ఈ గ్రూపుల్లో శృంగార వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో మహాత్మాగాంధీ రోడ్డు, ఏలూరు రోడ్డులో షాపుల వద్ద మెట్లపై కూర్చుని యువత వీడియోల వీక్షణలో మునిగిపోతున్నారు. ఉచిత వైఫై ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ గ్రూపులన్నీ విదేశాల నంబర్లతో క్రియేట్ అయి ఉంటున్నాయి. ఈ గ్రూపుల నిండా అసభ్యకర వీడియోలు, చిత్రాలే కనిపిస్తున్నాయి.ఆన్లైన్లో కాల్ గర్ల్స్ కోసం వెబ్సైట్లలో డబ్బులు కోల్పోయిన బాధితులు ఇప్పటి వరకు మా వద్దకు రాలేదు. వారు ముందు రాకపోవడానికి సామాజిక కారణం ఉంటుందనుకుంటున్నాం. వాట్సాప్లో అసభ్యకర గ్రూపులు క్రియేట్ చేసినా, వాటిలో అసభ్యర చిత్రాలు, వీడియోలు షేర్ చేసినా ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు అంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు.విజయవాడలో బయటపడిన ఈ కాల్ గర్ల్స్ మోసం గురించి అలాగే ఇలాంటివి మోసాలు అని తెలిసిన కూడా మళ్ళి మళ్ళి మోసపోతున్న యువత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.