BREAKING NEWS -ప్ర‌ముఖ క్రికెట‌ర్ కు బ్రెయిన్ ట్యూమ‌ర్ ఆందోళ‌న‌లో ఫ్యాన్స్

265

క్రికెట్ అంటే అభిమానం చాలా మందికి ఉంటుంది.. మ‌న దేశంలో ఏ క్రీడ‌కు లేన‌టువంటి ఫ్యాన్స్ కేవ‌లం క్రికెట్ కు మాత్రమే ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ ఆడేవారు ఎవ‌రైనా క్రీడాకారుల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి క్రీడాకారుల‌కు ఏమైనా అయితే త‌ట్టుకోలేరు. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్‌ జట్టు సభ్యుడు, స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతున్నాడు. దీనికి చికిత్స తీసుకోవడం కోసం త్వరలోనే సింగపూర్ వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించినట్లు ఢాకాలో ప్రచురితమయ్యే ఓ పత్రిక వెల్లడించింది. ఈ వార్తతో బంగ్లా క్రికెట్‌లో విషాదం అలముకుంది.

Image result for స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్

ఆరోగ్యం బాగోలేదని ఢాకాలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ముషారఫ్ హుస్సేన్‌కు.. అక్కడి వైద్యులు బ్రెయిన్‌ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉండడంతో సింగపూర్ వెళ్లి సర్జరీ చేయించుకోవచ్చని సూచించారు. దీంతో అతడు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే సింగపూర్ విమానం ఎక్కనున్నాడు. ముషారఫ్ హుస్సేన్‌ సర్జరీకి దాదాపు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు.

Image result for స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్

దీనిపై ముషారఫ్ హుస్సేన్‌ ఇటీవల మాట్లాడాడు. ‘‘నాకు సర్జరీ అవసరం. దీని కోసం సింగపూర్ వెళ్తున్నాను. ప్రస్తుతం వీసాకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే సింగపూర్ వెళ్తాను. నాకు ట్యూమర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను, నా కుటుంబం కృంగిపోయాం. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉందని తెలియగానే మాకు కొంత ఉపశమనం కలిగింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డుకు చెప్పాను. అందరూ నన్ను ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. నేను కూడా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి

ముషారఫ్ హుస్సేన్‌.. బంగ్లాదేశ్ జట్టు తరపున ఐదు అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. మొత్తంగా 25 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 3000కు పైగా పరుగులు చేయడంతో పాటు, 392 వికెట్లను పడగొట్టాడు. 2008 అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన హుస్సేన్.. ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2016లో చివరి వన్డే ఆడాడు. అత‌ను ఆరోగ్యంగా ఉండాలి అని బంగ్లా క్రికెట‌ర్లే కాదు యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం కోరుకుంటోంది.