బ్రేకింగ్ న్యూస్ : జమ్మూ కాశ్మీర్ లో మరో ఉగ్ర దాడి .. ఎంత మంది చనిపోయారో తెలిస్తే షాక్

339

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల
బాంబులు జారవిడిచింది…భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు ప్ర‌క‌టించింది. ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి.

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది భార‌త వైమానిక బృందం… ఈ దాడిలో
భారత వైమానిక బృందం స‌క్సెస్ అయింది..ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు సైన్యం. ఇక దాడుల
నేప‌థ్యంలో సైన్యానికి సెల‌వుల‌ను ర‌ద్దు చేసింది భార‌త ప్ర‌భుత్వం.

వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని వెల్ల‌డించారు… వైమానిక దళ ఫైటర్‌ జెట్స్‌ ఎల్‌ఓసీ దాటి ఈ దాడులు
నిర్వహించాయి. బాలాకోట్‌, చకోటీ, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆల్ఫా-3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేశాయి. బాలాకోట్‌కు 30 కిలోమీటర్ల దూరం వరకూ
బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు చెబుతున్నారు.

పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకు పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌
గతంలో విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది. 2016 సెప్టెంబర్‌ 29న నియంత్రణ రేఖను దాటి ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది.

భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్లు పాక్‌ సైన్యం ధ్రువీకరించింది. పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ దాడులపై స్పందించారు. భారత విమానాలను తిప్పికొట్టినట్లు ఆయన వాదిస్తున్నారు.
ముజఫరాబాద్ సెక్టార్ లోకి భారత వాయుసేన చొచ్చుకువచ్చింది. పాక్‌ వైమానిక దళం ఈ దాడిని తిప్పికొట్టింది. అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు అని పాక్‌ ఐఎస్‌పీఆర్‌ డీజీ మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ
దాడిలో ఇప్ప‌టి వ‌ర‌కూ 300 మంది మ‌ర‌ణించారు అని తెలుస్తోంది, ఇక దీనిపై పాక్ ఎలాంటి కౌంట‌ర్ ఇచ్చినా, తిరిగి తిప్పి కొట్టేందుకు భార‌త్ సిద్దంగా ఉంది అని చెబుతున్నారు ఆర్మీ అధికారులు. ఇక పాక్ కూడా మ‌రిన్ని దాడులు అర్ధరాత్రి పూట
చేసే అవ‌కాశం ఉంది అని స‌రిహ‌ద్దు గ్రామాల్లో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు, ఇక ఉగ్ర‌వాదులు కూడా మ‌రిన్ని ఆత్మాహుతి దాడుల‌కు తెగ‌బ‌డితే ప‌రిస్ధితి ఏమిటి అని ఆలోచిస్తున్నారు స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో జ‌నం. అయితే పాక్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి
హాని జ‌రుగ‌కుండా ఉగ్ర‌వాదులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది భార‌త వాయుసేన… ఒక‌వేళ భార‌త్ పై ఇలా బాంబుల వ‌ర్షం కురిపిస్తే పాకిస్ధాన్ కోలుకోలేని విధంగా భార‌త్ బుద్ది చెప్ప‌డానికి సిద్దంగా ఉంది అంటున్నారు అధికారులు.

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మరో పన్నాగానికి పాకిస్థాన్ పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను విడిపించేందకు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకురావడం .. పాక్ ను
ఏకాకి చేయడంతో ఆ దేశం అంతర్గతంగా రగులుతున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వర్తించే జవాన్ల నిత్యావసర సరుకుల్లో విష ప్రయోగం చేయాలని ప్రణాళిక రచించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ పన్నాగాన్ని పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ పాటుపడే అవకాశం ఉందని .. సరుకులు పంపిణీ చేసే సమయంలో ఒకటికి, రెండుసార్లు చూసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేసింది.

రేషన్ క్యాంపుల వద్ద భద్రత అభినందన్ విడుదల .. వాయుసేన దాడులతో రగిలిపోతోన్న పాకిస్థాన్ .. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతోపాటు ప్రతీకారంగా కశ్మర్ లోయలో జవాన్లకు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల్లో విష ప్రయోగం
చేసి దెబ్బకొట్టే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం. దీంతో ముందుజాగ్రత్తగా చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే క్యాంపుల వద్ద భారీగా భద్రతాసిబ్బందిని మొహరించింది. దేశంలోని
ఇతరప్రాంతాల్లో కూడా ఒక కశ్మీర్ పై ఫోకస్ చేస్తే మూకలు .. ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్నిప్రాంతాల్లో జవాన్లకు అందజేసే రేషన్ క్యాంపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది.
సరుకులను ఎప్పటికప్పుడు చెక్ చేయడం వల్ల ఉగ్ర మూకల చర్యలను వేగంగా తిప్పికొట్టొచ్చని ఐబీ వర్గాలు సూచించాయి.