Breaking News జగన్ కేసులో చంద్రబాబు అరెస్ట్.. షాక్ లో బాలకృష్ణ

469

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన కత్తి దాడి ఘటన రాష్టంలో సంచలన రేపిన సంగతి మన అందరికి తెలిసిందే.. ఈ విషయం లో వైసీపీ నాయకులు టీడీపీ కుట్ర ఉందంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు, టీడీపీ నాయకులూ సైతం అదే స్థాయిలో ఎదురు దాడికి దిగుతున్నారు.ఈ కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లభ్ది పొందాలని ఇరు పార్టీల వారు అనుకుంటున్నారు..అయితే నిందితుడు శ్రీనివాస్ చెప్పేవరకు ఈ విషయంలో ఒక క్లారిటీ రాదూ.సిట్ అధికారులకు ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సమాచారం.అలాగే జగన్ కోర్ట్ లో కేసు కూడా వేశాడు.ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రలో భాగమే అని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జగన్ హైకోర్టులో కేసు కూడా వేసారు..కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.ఈ విషయాన్నీ పక్కన పెడితే ఈ కేసు ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

వైఎస్ జగన్‌పై దాడి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 8మందికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో ఈ కేసుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఎంతో పాటూ ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీలకు కూడా నోటీసులు ఇచ్చారు. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో అందించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.

మరోవైపు దాడి కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా మంగళవారం విచారణ జరిగింది. సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు కేసు వివరాలను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో సీసీ టీవీ ఫుటేజ్‌ వివరాలను ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్‌ లేదని అధికారులు తెలపడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై సిట్‌ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ భద్రతా లోపాలు క్షమించారానివని ధర్మాసనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమాధానము చెప్పాలని కోర్ట్ నోటీసులు ఇచ్చింది.చూడాలి మరి ఈ కేసు విచారణ చివరికి ఎక్కడికి వెళ్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.