Breaking News :భారీగా తగ్గిన బంగారం ధర

80

పసిడి మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.39,100కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Image result for gold

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.30 తగ్గుదలతో రూ.35,840కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1,514.45 డాలర్లకు తగ్గింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గి 17.08 డాలర్లకు తగ్గింది.

Related image

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.38,300 వద్దనే కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.37,100 వద్ద నిలకడగా ఉంది. ఇక కేజీ వెండి స్థిరంగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. అయితే ఇటీవల బంగారం ధర అమాంతం పెరుగుతూనే ఉంది మార్కెట్లో రేట్లు పెరగడానికి కారణం షేర్లు కంటే బంగారం పెట్టుబడికి లాభం అని ఆలోచిస్తున్నారు అందుకే బంగారం ధర భారీగా పెరిగిపోతోంది.

Image result for gold

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో బంగారం ధర ర్యాలీ జరుగుతోంది.. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది అందుకే గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతోంది….కేంద్ర ప్రభుత్వం జూలై నాటి బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీంతో బంగారం దిగుమతులు పన్ను పెరిగాయి. అందుకే బంగారం ధర కూడా పెరుగుతోంది.

ఈ క్రింద వీడియో చూడండి

అమెరికా ఫెడరల్ రిజర్వు రానున్న కాలంలో వడ్డీ రేట్లను మరింత తగ్గించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి సాధనాలకు డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఈ అంశం కూడా పసిడి పరుగుకు మద్దతునిస్తోంది. సెంట్రల్ బ్యాంకులు రెండో త్రైమాసికంలో 224.4 టన్నుల బంగారం కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది… అయితే నేడు స్వల్పంగా బంగారం రేటు తగ్గినా దిపావళి వరకూ బంగారం ఇదే రేటులో ఉంటుంది అని చెబుతున్నారు వ్యాపారులు.