మసాజ్ కోసం 8 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నాడు తర్వాత ఏమైందంటే

424

బాధ ఉన్న మనసుకి ఓదార్పు కావాలి ..అలసిన దేహాలకు మసాజ్ కావాలి అని అంటున్నారు యువత… ముఖ్యంగా ఇప్పుడు సరదాగా మసాజ్ పార్లర్ కు వారానికి ఒకసారి వెళ్లేవారు చాలా మంది ఉంటున్నారు.. ఏరియాకో మసాజ్ పార్లర్ పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. కేవలం మలేషియా ధాయ్ లాండ్ సింగపూర్ కు పరిమితం అయిన మసాజ్ పార్లర్లు దేశంలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న అర్బన్ సిటీస్ కు కూడా వస్తున్నాయి.. ముఖ్యంగా మసాజ్ పార్లర్ ల విషయంలో. ఎడారి దేశంలో ప్రకటనలకు చాలామంది మోసపోతున్నారు. తాజాగా దుబాయ్ లో ఓ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దుబాయిలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు ఆన్‌లైన్ లో మసాజ్ గర్ల్స్ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే అందులో ఫోన్ నెంబర్ చూసి ఆ యువకుడు వాట్సప్ చేశాడు. వాట్సప్ మెసేజ్ అందుకున్న ఈ మసాజ్ పార్లర్లోని ఓ మహిళ ఆ యువకుడికి ఫోన్ చేసి బేరం మాట్లాడింది. మసాజ్ పార్లర్ ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆ యువకుడు పిచ్చెక్కిపోయాడు. ఇంకేముంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మందిని తన ఫ్లాట్‌కు పంపమని బుక్ చేసుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వాళ్లు ఫ్లాట్ వద్దకు వాలిపోయారు.

Image result for massage parlours in hyderabad

కాలింగ్ బెల్ నొక్కగానే ఆవురావురు మంటూ ఆ యువకుడు తలుపుతీసి చూశాడు. ఎనిమిది మంది బలిష్టమైన ఆఫ్రికా మహిళలకు తలుపు తీయగానే ప్రత్యక్షమయ్యారు. ఆ ఎనిమిది మంది ఆఫ్రికన్ మహిళలు ఆ వ్యక్తిని లోపలకు లాక్కుని వెళ్లారు. ఆ తర్వాత ఒళ్లు హూనం అయ్యేలా అతడిని బాది.. ఓ గదిలో నిర్భందించి అతడి దగ్గర నుంచి దాదాపు రూ. 11 లక్షల దాకా కాజేశారు. అలాగే ఇంట్లోని సామాన్లతో సహా విలువైన వస్తువులను ఎంచక్కా ప్యాక్ చేసుకొని, విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించి తాపీగా వెళ్లిపోయారు. అయితే ఆ వ్యక్తి మాత్రం భయంతో పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులకు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. కాగా గతంలో కూడా ఈ మహిళలు గ్యాంగ్ గా ఏర్పడి, పలు దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు.

ఈ క్రింద వీడియో చూడండి

అంతేకాదు చాలా మంది కుర్రవాళ్లు, భార్యలు లేని భర్తలు, ఈ ఆఫ్రికన్ ముఠా చేతిలో చిక్కారట.. దాదాపు ఫర్మిచర్ అంతా ముందుగానే ఓ వ్యాన్ మాట్లాడుకుని పథకం ప్రకారం కస్టమర్ ఇంటిని గుల్ల చేస్తున్నారు. అందుకే ఇలాంటి మసాజ్ పార్లర్ నెంబర్లు చూసి మోసపోకండని చెబుతున్నారు పోలీసులు, ఈ ముఠాకి స్పెషల్ గ్రూప్ ఉందని వారి వల్ల ఈ ముఠా నడుస్తోందని వారిని కాల్ లిస్ట్ ప్రకారం పట్టుకుంటున్నామని పోలీసులు తెలియచేశారు.. చూశారుగా అతిగా ఆవేశపడిన మగాడి కథ అంటూ అక్కడ మీడియా కూడా కోడై కూసింది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.