సీక్రెట్ గా అమ్మాయిని అర్ద‌రాత్రి పిలిచిన ల‌వ‌ర్ ఏం చేశాడో తెలిస్తే బిత్త‌ర‌పోతారు

435

కొంద‌రు ప్రేమించి ఇటీవ‌ల ఆ ప్రేమ‌లు సాధించుకోలేక చ‌నిపోతున్నారు, అలాగే పెద్ద‌ల నుంచి కూడా ఎదురు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి వారి చేతిలో కొంద‌రు ప్రేమికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అమ్మాయిలు మాత్రం ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ ప్రేమికుల ప్రేమ‌ను తిర‌స్క‌రిస్తున్నారు, దీంతో ప్రేమికులు అమ్మాయిల‌ను చంపేందుకు కూడా వెన‌కాడ‌టం లేదు.తాజాగా ఇలాంటి ఓ దారుణం జ‌రిగింది.

Image result for loversచోడవరం శివారు లక్ష్మీపురం రోడ్డులోని ఫారెస్టు డిపో సమీపంలో బుధవారం వెలుగులోకి వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం, హత్య సంఘటన పట్టణంతో పాటు మండలంలో సంచలనమైంది. దీపావళి పండుగ పూట అంతటా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిని పద్మావతిని ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజు ప్రేమిస్తున్నాడు. అతడే స్నేహితుల సాయంతో హత్య చేసి ఉంటాడని అంతా అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. .

Image result for lovers

చోడవరం కోటవీధికి చెందిన పద్మ అనే అమ్మాయి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఎదురింటిలో ఉంటున్న మైనర్‌ బాలునితో ప్రేమలో పడింది.. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. మంగళవారం రాత్రి రాజు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.ఆ తరువాత అంతా పార్టీ చేసుకున్నారు. ఇక ఈ స‌మ‌యంలో రాజు స్నేహితుల‌తో ఉన్నాడ‌ని చెబుతున్నారు.

Image result for lovers

బుధవారం ఫారెస్టు డిపో సమీపంలో బాలిక హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ విష‌యం తెలుసుకుని సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యచేశాక పెట్రోలు పోసి తగులబెట్టడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌కు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి అక్కడ ఆనవాళ్లు పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటన స్థలం వద్ద నుంచి పక్కనే ఉన్న తోటలు, ఖాళీ స్థలాల్లో తిరిగి సమీపంలో ఉన్న ఒక చర్చి వద్దకు వెళ్లి నిలిచిపోయాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా, ఇంటిలో మంగళవారం రాత్రి పడుకున్న కుమార్తె తెల్లవారే సరికి కనిపించక పోవడంతో ఈ దంపతులు చుట్టుపక్కల వెతుకుతున్న సమయంలో ఎవరో బాలిక హత్యకు గురైనట్లు గ్రామస్తులు చెప్పుకోవడంతో అనుమానం వచ్చి పోలీసుల వద్దకు వెళ్లారు. సంఘటన స్థలంలోని ఆనవాళ్లు ప్రకారం తమ కుమార్తెవే అని గుర్తించారు. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అనకాపల్లి తరలించి విచారిస్తున్నారు. ఇప్ప‌టికే పోలీసు ఉన్న‌తాధికారులు ఈ విష‌యం పై అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు…నిందితులను దోషులుగా ఇంకా నిర్ధారించలేదని తెలియ‌చేశారు.. ఇక అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమించింది అని తెలుస్తోంది, వీరి ఇద్ద‌రి ప్రేమకు ఇంటిలో ఒప్పుకోలేదు… అయితే ఈ స‌మయంలో ప్రేమించిన అమ్మాయిని ఎందుకు చంపుతాడు అని కూడా ఆలోచిస్తున్నారు, మ‌రి దీనిలో అన్నీ కోణాల్లో విచార‌ణ జ‌రిపి నిజాలు నిగ్గుతేల్చాల్సి ఉంది.