చనిపోయే ముందే అతని ఇంట్లో వారం రోజులు గడిపిన నటి ఝాన్సీ…ఎందుకుందో తెలిసి షాకైన పోలీసులు

350

సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు విచారణలో వెల్లడైన అంశాల ప్రకారం మంగళవారం ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు పురిగొల్పడం, పెళ్లి చేస్కుంటానని మోసం చేయడం వంటి నేరాలకు సంబంధించిన కేసును నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణలో ఝాన్సీ అతనిపై ఎంతో ప్రేమ, నమ్మకం పెంచుకున్నట్లు, సూర్య మాత్రం తరచూ అనుమానంతో గొడవపడుతుండేవాడని, అతనికి ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గతేడాది ఏప్రిల్‌లో ఇద్దరికీ పరిచయమైంది. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాక, పెళ్లి చేస్కుంటామని ఝాన్సీ ఇంట్లో కూడా చెప్పారు, ఆ తర్వాత ఆమె వారం రోజుల పాటు సూర్య ఇంట్లో ఉంది. నవంబర్‌లో సూర్య పుట్టినరోజున ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చిందని, దానితో బైక్ కొన్నట్లు తెలిసింది. ఝాన్సీ నటించడం సూర్యకు ఇష్టం లేకపోవడంతో తరచుగా వారి మధ్య గొడవలు జరిగేవి. అందుకే ఝాన్సీ నటనకు దూరం అయ్యింది.
Image result for actress jhansi
కొంతకాలంగా ఈమె ఫోన్లను కూడా సూర్య ఎత్తడం లేదు. జనవరిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న ఝాన్సీ తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా అతనికి ఫోన్ చేస్తే, అతను స్పందించనట్లుగా తెలుస్తోంది. అయితే వాట్సప్‌లో సందేశాలు పంపింది, కాసేపటి మళ్లీ డిలీట్ చేయడంతో సూర్యకు ఆ సందేశాలు కనిపించలేదు. ఆ తర్వాత అతను సందేశాలు పెట్టినప్పటికీ ఝాన్సీ నుండి బదులు రాలేదని వివరించారు.