తండ్రి ద్వారా పిల్లాడికి హెచ్‌ఐవీ వైరస్..ఎలానో తెలిస్తే షాక్ ..ప్రతీ ఒక్కరు చూడాల్సిన వీడియో

307

ఎయిడ్స్ మహమ్మారి ఎంతో భయంకరమైనదో తెలిసిందే.ఈ వ్యాధి బారిన పడితే చివరికి చనిపోవడం ఒక్కటే దారి.అయితే ఇప్పుడంటే ఏదో కొంత అవగాహనా వచ్చి జనాలు కొంతకాలం అయినా బ్రతుకుతున్నారు.కానీ 10 ఏళ్ల కిందట ఈ వ్యాధి సోకిందంటే ఇక వాళ్ళ పని అంతే సంగతి.హెచ్ఐవీ సోకడానికి పలు కారణాలు ఉన్నాయి.అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా హెచ్ఐవీ వచ్చే అవకాశం ఉంది.తల్లికి హెచ్ఐవీ పాజిటివ్ ఉంటె బిడ్డకు కూడా సోకె అవకాశం ఉంది.అయితే హెచ్‌ఐవీ నెగటివ్‌ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డకు హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉందా అంటే ఉంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టినా తండ్రి నుంచి కూడా చిన్నారికి ఈ వైరస్‌ సోకుతుందని పోర్చుగల్‌లోని లిస్బన్‌ వర్సి టీ పరిశోధకులు గుర్తించారు. అయితే అత్యంత అరుదైన కేసుల్లోనే ఇది సాధ్యమని వారు వెల్లడించారు.మరి వారు ఏమేమి చెప్పారో చూద్దామా.

హెచ్‌ఐవీ నెగటివ్‌ ఉన్న తల్లికి 2009లో పుట్టిన బిడ్డకు 2013లో హెచ్‌ఐవీ-1 ఉన్నట్టు గుర్తించారు. ఇదెలా సాధ్యమైందనే అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో తండ్రీ, కొడుకుల ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించారు.తన తండ్రికి తగిలిన గాయం నుంచి కారిన రక్తంతో శిశువుకు ఏయిడ్స్ వ్యాధి సోకిందని వైద్యులు పేర్కొన్నారు. దీనిపై పోర్చగల్‌లోని లిస్భన్ విశ్వవిద్యాలయం బృందం వైద్య పరిశోధన చేస్తోంది. జన్యు, వంశ సంబంధ పరిశీలను చేసిన వారికి అసలు విషయం బయటపడింది. తండ్రీబిడ్డలకు పరీక్షలు చేసిన దరిమిలా శాస్త్రవేత్త బాబు పుట్టిన సమయంలో తండ్రి నుంచి వ్యాధి సోకిందని పేర్కొన్నారు.తండ్రికి ఒకప్పుడు పొంగు వ్యాధి సోకడం, పొక్కుల్లా వ్యాపించడం, ఇతర పరిస్థితుల కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. దాని ఫలితంగా శరీర భాగాల్లో ఏర్పడిన స్రావం అంటుకొని, బాలుడు కూడా హెచ్‌ఐవీ బాధితుడయ్యాడని పరిశోధకులు తేల్చారు.

వివిధ పరిస్థితిలో తల్లిదండ్రలు శరీరం నుంచి వెలువడే ద్రవ పదార్థాలు నుంచి పిల్లలకు వివిధ రకాలు వ్యాధులుగా మారుతాయని అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ హోప్‌ తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధి ప్రాణాంతకైన వ్యాధి కాదు. దీర్ఘకాలికంగా మందులను వాడడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే పసిబిడ్డకు తండ్రి నుంచే ఆ తరహా విపత్కర‌స్థితి ఎదురుకావడాన్ని వైద్యపరంగా మరింత పరిశోధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.విన్నారుగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి.