ఆ లోపమే బాలుడి పాలిట శాపమైంది.! తాంత్రికుడు చెప్పాడని సంపదల కోసం బలిద్దాం అనుకున్నారు.!

305

సమాజం ఇంత అభివృద్ధి అవుతున్నా టెక్నాలజీ పరుగులు పెడుతున్నా ఇప్పటికి కూడా మూఢనమ్మకాలను నమ్మే పిచ్చి జనాలు భారతదేశంలో ఇంకా ఉన్నారు.తాంత్రిక పూజలు చేతబడి లాంటివి నమ్మి వాటి వలన జీవితాలను నాశనము చేసుకుంటున్నా చేస్తున్న ప్రజలు ఇప్పటికి చాలా గ్రామాలలో ఉన్నారు.సంపదలు వస్తాయని తాంత్రికులు చెబితే ఏం చేయడానికైనా వెనుకాడరు చివరికి చంపడానికి కూడా సిద్ధపడతారు.ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అలాంటిదే.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో నివసించే ఒక పిల్లాడు సాధారణ మనిషి కాదు.అంటే అందరిలా అతను లేడు.మనకు కాళ్లకు చేతులకు 20 వేళ్ళు ఉంటె అతనికి మాత్రం 24 వేళ్ళు ఉన్నాయి.చేతులకు 12 వేళ్లు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడమే ఇప్పుడు ఆ బాలుడి పాలిట శాపంగా మారింది.అలా ఉండడం అదృష్టం అని కారణజన్ముడని అతని బంధువులు అనుకునేలా చేస్తుంది.అందుకే మూఢనమ్మకాల పేరుతో బంధువులే ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం బారాబంకి జిల్లాలో కలకలం రేపింది. లోపంతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే సంపద కలిసి వస్తుందని ఓ తాంత్రికుడు అతని బంధువులకు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుడిని చంపాలని ప్రయత్నించారు.రెండుమూడు సార్లు ఎలాగోలా తప్పించుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లితండ్రులు కొడుకును కాపాడుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. కనీసం ఆ బాలుడిని బడికి కూడా పంపడంలేదు.చివరికి ఏం చెయ్యాలో తెలియక పోలీసులను కూడా ఆశ్రయించారు.

దీనిపై బారాబంకి పోలీసు అధికారి ఉమాశంకర్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఆ బాలుడు చదుకోవడానికి పోలీసులు సహాయం చేస్తారని చెప్పారు. ఆ బాలుడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇక్కడ బాధ్యతలు నిర్వహించినంత కాలం బాలుడి చదువుకయ్యే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. అంతేకాదు బాలుడిని చంపాలి అనుకున్న వారిపై విచారణ మొదలుపెడతాం అన్నారు.బాలుడికి ఏమి కాకుండా మేము రక్షణగా ఉంటాం అని పోలీసులు తల్లిదండ్రులకు మాట ఇచ్చారు.చూశారుగా ధనం వస్తదని ఎవరో పిచ్చోడు చెబితే అభం శుభం తెలియని పసివాడిని చంపడానికి ఎలా సిద్దపడుతున్నారో.ఇలాంటి వారిని ఏం చెయ్యాలో మీరే చెప్పండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.