హైదరాబాద్ డీ మార్ట్ లో బాంబ్ కలకలం నిజామా?లేక ఫెకా ?

259

హైదరాబాద్‌ అత్తాపూర్ డీమార్ట్‌లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. కశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. డీమార్ట్‌లో ఉగ్రవాది చొరబడ్డాడు అనే వార్త నగరవాసుల్లో ఆందోళన నింపింది. అయితే ఆ తర్వాత ఆ వీడియో ఫేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వీడియో నిజమైనదే అని తేలింది. అయితే ఈ సంఘటన జరిగింది హైదరాబాద్‌లో కాదు. ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న డీమార్ట్‌లో ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది.

Image result for dmart

ముంబై విరార్ ప్రాంతంలో ఉన్న డిమార్ట్‌లో షాపింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు కస్టమర్లు. సాయంత్రం వేళ ఒక్కసారిగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఏదేదో అరుస్తూ చేతుల్లో తుపాకులు పట్టుకొని హడావిడి చేశారు. అన్ని ఫ్లోర్లలోకి పోలీసులు రావడంతో కస్టమర్లు కంగారు పడ్డారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. అంతలోనే కొందరు పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ముఖానికి ముసుగువేసి బయటకు లాక్కొచ్చారు. ‘ఉగ్రవాదిని పట్టుకున్నాం’ అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడున్న జనాలను షాక్‌కు గురిచేసింది. డి-మార్ట్‌లోకి ఉగ్రవాదులు చొరబాడ్డారని భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఇక మార్ట్ చుట్టుపక్కల ఉన్నవాళ్లు పోలీస్ ఆపరేషన్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షాపింగ్ మాల్‌లో టెర్రరిస్టులు బాంబులు పెడుతుండగా పోలీసులు పట్టుకున్నారని ప్రచారం చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

కానీ వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే..మాక్ డ్రిల్..! పాల్‌గఢ్ జిల్లా పోలీసుతో పాటు రయిట్ కంట్రోల్ పోలీస్, క్విక్ రిస్పాన్స్ టీమ్స్ కౌంటర్ టెర్రర్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. టెర్రరిస్టులు చొరబడినప్పుడు పోలీసులు ఎలా స్పందించాలి..ప్రజలు ఎలా తప్పించుకోవాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఓ డమ్మీ టెర్రరిస్ట్‌ను లోపలికి పంపించి అతడిని చాకచక్యంగా ఎలా పట్టుకోవాలో లైవ్‌లో చేసి చూపించారు. ఈ మాక్ డ్రిల్‌లో ముగ్గురు పోలీస్ అధికారులతో పాటు 25 మంది సిబ్బంది పాల్గొన్నారు. కాగా, కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు అప్రమత్తమ్యాయి. బస్టాండ్‌, రైల్వే స్టేషన్, సూపర్ మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి.ఇదండీ జరిగింది. కాబట్టి ఆ వీడియో నిజమని ఎవరు నమ్మకండి. మరి ముంబై పోలీసుల మాక్ డ్రిల్ వీడియో గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.