Breaking News:సినీ ఇండస్ట్రీ లో మరో ఘోరం ప్రముఖ గాయకుడు హఠాన్మరణం.. ..శోకసంద్రంలో బాలు,చిత్ర

496

దేశంలో ప్రముఖులు వరుసగా చనిపోతున్నారు.అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి అలాగే సాహిత్య రంగంలో కృషి చేసిన ప్రముఖులు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకుంటున్నాయి.ఇప్పుడు ప్రముఖ గాయకుడు మహ్మద్‌ అజీజ్‌(64) కన్నుమూశారు. ముంబయిలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. కోల్‌కత్తా నుంచి వస్తుండగా కార్డియాక్ అరెస్ట్ అయిన ఆయనను విమానం ల్యాండ్ అయిన వెంటనే సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గాయకుడు తుదిశ్వాస విడిచారు. జానీ లెవర్ సోదరు జిమ్మీ మోసెస్ తన ఫేస్‌బుక్ పోస్టుతో ఈ విషాదాన్ని అభిమానులకు తెలిపాడు.బెంగాలీ సినిమా ‘జ్యోతి’లో తన మొదటి పాటను పాడాడు. తర్వాత ముంబయి వచ్చిన అజీజ్‌ 1984లో హిందీలో ‘అంబర్‌’ సినిమాకు పాడారు. అమితాబ్‌ నటించిన ‘మర్ద్‌’ చిత్రంలో పాడటానికి సంగీత దర్శకుడు అను మాలిక్‌ అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో పాట అతని జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.

ఇక అది మొదలుకుని తన శ్రమ, పట్టుదలతో ఉన్నతశిఖరాలు అదిరోహించారు.మాడు దశాబ్దాల తన ప్రయాణంలో ఎందరో గాయకులతో కలిసి పనిచేశారు. అమితాబ్‌, గోవిందా, రిషి కపూర్‌, మిథున్‌ చక్రవర్తి, ఇతర నటుల చిత్రాలకు పాడారు. లతా మంగేష్కర్‌, ఆశా బోంస్లే, కవితా కృష్ణమూర్తి, అనురాధ పద్వాల్‌ గాయనీలతో కలిసి పాడారు.‘మై నేమ్ ఈజ్ లకన్’ లాంటి ఫేమస్ సాంగ్స్ పాడిన అజీజ్.. హిందీ, బెంగాలీ, ఒరియా భాషలలో 20వేల కంటే ఎక్కువ పాటలు పాడారు. అజీజ్‌‌కు లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ అంటే ప్రాణం. మూడున్నర దశాబ్దాలపాటు సింగర్‌గా సేవలందించిన అజీజ్ ఇకలేరన్న విషయాన్ని బాలీవుడ్, బెంగాలీ, ఒరియా ఫిల్మ్ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించాయి.