breaking news..ప్రముఖ నటి మృతి..షాక్ లో శ్రీదేవి ఫ్యామిలీ..

443

వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు.దాంతో వారి అభిమానులు తీవ్ర ఆవేదనలో ఉంటున్నారు.అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖుల ఇళ్ళలో విషాద చాయలు అలుముకుంటున్నాయి.కొందరు హెల్త్ ప్రాబులమ్స్ వలన కొందరు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.ఇప్పుడు మరొక యాక్ట్రెస్ చనిపోయింది.మరి ఆమె ఎవరో ఎలా చనిపోయిందో తెలుసుకుందామా.

బాలీవుడ్ నటి సుజాత కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని లీలావతి హాస్పిటల్‌ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె ప్రముఖ నటి, గాయని, దర్శకుడు శేఖర్ కపూర్ సుచిత్ర కృష్ణమూర్తికి సోదరి. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో దివంగత శ్రీదేవికి సోదరిగా సుజాత కుమార్ నటించారు.ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సుచిత్రా కృష్ణమూర్తి తన ఫేస్‌బుక్ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు.నా సోదరి సుజాత కుమార్ ఆదివారం రాత్రి 11.26 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. మనందరి విడిచి మరో లోకానికి వెళ్లిపోయారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని సుచిత్రా కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. గత రెండు రోజుల క్రితం నా సోదరి మృత్యువుతో పోరాడుతున్నది. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించండి. ఆమె చావు బతుకుల మధ్య ఉండటం వలన నాకు ఎవరో గుండెల్లో బాకు గుచ్చినట్టు ఫీలవుతున్నాను. ఆమె నాకు సోదరే కాదు. మంచి స్నేహితురాలు. నా డార్లింగ్. అలాంటి నా సోదరికి ఎదురైన పరిస్థితిని చూసి బాధను తట్టుకోలేకపోతున్నాను అని సుచిత్ర ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

హోటల్ కింగ్‌స్టన్, బాంబే టాకింగ్ లాంటి టీవీ సీరియల్స్‌లో సుజాత కుమార్ నటించారు. అనిల్ కపూర్ నటించిన 24లో మేఘన సింఘానియా నటించారు. సినిమాల విషయానికి వస్తే రంజ్నా, సలాం ఏ ఇష్క్, గోరి తేరే ప్యార్ మే, ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాల్లో నటించారు.ఆమె మృతికి ఇంగ్లిష్ వింగ్లీష్ చిత్ర దర్శకుడు గౌరీ షిండే నివాళులు అర్పించారు.తన సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.