పాకిస్ధాన్ కు దొరికిన భార‌తీయ పైల‌ట్ ను ఎంత దారుణంగా హింసించారో చూడండి

246

ఈరోజు ఉద‌యం భార‌త్ భూభాగంలోకి పాకిస్ధాన్ యుద్ద‌విమానాలు ఎంట‌ర్ అయ్యాయి.. ఈ సమ‌యంలో ఎఫ్ 16 అనే యుద్ద విమానం వ‌చ్చింది .. అయితే ఈ యుద్ద విమానాన్ని కూల్చిన స‌మ‌యంలో మ‌న పైల‌ట్ వింగ్ క‌మాండ‌ర్ విక్ర‌మ్ అభినంద‌న్ అనే పైల‌ట్ పాక్ స‌రిహ‌ద్దుల్లో ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయారు అని అత‌నిని పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్నారు అని ఇప్ప‌టి వ‌ర‌కూ వార్త‌లు వ‌చ్చాయి.తమ‌ భూభాగంలో కూల్చేసిన విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ అనే పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ చెబుతోంది.

Image result for abhinandan

ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. అయితే భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్‌ ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వారి విమానం కూల్చివేసిన స‌మ‌యంలో మ‌న విమానం కూల్చివేశాము అని తెలియ‌చేసింది.భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్‌కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ వెల్లడించారు. పాక్‌ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కాని ఇది వాస్త‌వం కాదు అని భార‌త వాయుసేన చెబుతోంది. రాజౌరీ సెక్టార్‌లో పాక్‌కు చెందిన యుద్ధివిమానాలు నియంత్రణ రేఖను దాటి వచ్చాయి. వీటిని భారత వాయుసేనకు విమానాలు వాటిని తిప్పికొట్టాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

దీంతో కశ్మీర్‌లో పౌరవిమానాల రాకపోకలపై నిషేధం విధించారు. అయితే విక్రమ్‌ అభినందన్ అనే పైల‌ట్ ని ఇప్పుడు పాక్ క‌స్ట‌డీలో ఉన్నాడు అని విదేశాంగ శాఖ అధికారులు తెలియ‌చేశారు మిగ‌తా వివ‌రాలు తెలియ‌చేస్తామ‌ని పాక్ అధికారుల‌తో ఈ విష‌యాలు చ‌ర్చిస్తున్నాము అని తెలియ‌చేశారు. కాని విక్ర‌మ్ పై అక్క‌డ పాక్ ఆర్మీ పాశ‌వికంగా దాడిచేసిన దృశ్యాలు పాకిస్ధాన్ లోని సోష‌ల్ మీడియాలో అక్క‌డ వారు తెగ వైర‌ల్ చేస్తున్నారు.. ఇరు సైన్యాల‌కు సంబంధించిన సైనికులు ఎక్క‌డైనా వారికి క‌నిపిస్తే, వారిని క‌స్ట‌డిలోకి తీసుకుంటారు అంతేకాని ఇలా వారిపై దాడులు చేయ‌రు అని చెబుతున్నారు.. ఈ స‌మ‌యంలో పాక్ కావాల‌నే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది అని ఆర్మీ చెబుతోంది. మ‌రి వీరికి ఎలాంటి స‌మాధానం ఇవ్వాలి మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.