సికింద్రాబాద్ స్టేషన్ లో బ్యాగుల్లో రక్తం…హడలెత్తిన ప్యాసింజర్లు…ఇంతకు ఆ రక్తం ఎవరిదో తెలిస్తే షాక్.

313

మీ చుట్టుపక్కల అనుమానాస్పద బ్యాగులు ఉన్నాయా..అయితే ఓపెన్ చెయ్యకండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని మనం చాలా చోట్ల వినే ఉంటాం.అయితే కొన్నిసార్లు కొంతమంది అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ చేసి చూస్తారు.అందులో పెద్ద ప్రమాదం పొంచి ఉండకపోతే ఏం కాదు కానీ ఒకవేళ పొంచి ఉంటె మనకే కదా నష్టం జరిగేది.ఇప్పుడు ఈ సోదీ అంతా ఎందుకు చెబుతుందా అని అనుకుంటున్నారా..చెప్తా వినండి.రోజు కొన్ని లక్షల మంది తిరిగే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు ఒక అనుమానిత బ్యాగ్ కలకలం రేపింది.ఇంతకు ఆ బ్యాగ్ లో ఏముందో తెలుసా..పూర్తీగా చెబుతా వినండి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానిత బ్యాగులు పోలీస్, రైల్వే అధికారులను టెన్షన్ పెట్టాయి. ఆరో నంబర్ ప్లాట్ ఫామ్ లో నిలిచి ఉన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో డీ1, డీ4 బోగీల్లో మూడు సూట్ కేస్ బ్యాగులను ఎవరో విడిచిపెట్టి వెళ్లిపోయారు. సూట్ కేస్ సంచులనుండి రక్తం కారుతూ.. దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు ఆ బోగీలను ఖాళీ చేశారు. బ్యాగులో వ్యక్తుల మృతదేహం ఉందేమోనన్న అనుమానంతో ప్రయాణికులు స్టేషన్ లో దిగాక.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరినైనా చంపేసి బ్యాగులో మూట కట్టారా అనే అనుమానాలు స్టేషన్ లో ఒక్కసారిగా అలజడి రేపాయి.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బోగీల్లోకి వెళ్లారు. బ్యాగులను పరిశీలించారు. అందులో.. తాబేళ్లకు సంబంధించిన తోలు, మాంసం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు వందకు పైగా తాబేళ్లను చంపి వాటి తోలు, మాంసాన్ని అక్రమంగా తీసుకెళ్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఒక్క తాబేలు తోలు రేటు.. 5 వేల నుంచి 10 వేల వరకు ఉండొచ్చని.. దాదాపు 150 కిలోల వరకు మాంసం బ్యాగుల్లో ఉందని పోలీసులు చెప్పారు.గుర్తుతెలియని వ్యక్తులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఈ సంచులను వదిలివెళ్లినట్లు రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్యాసింజర్స్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఈ తాబేలు తోళ్లు, మాంసాన్ని అటవి శాఖ అధికారులకు అప్పగించారు.ఇలా అనుమానిత బ్యాగ్ లు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పి వెళ్లిపోయారు.