Breaking News:బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి.. షాక్ లో మోడీ

337

దేశంలో ప్రముఖులు వరుసగా చనిపోతున్నారు.అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగంలో ప్రముఖులు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకుంటున్నాయి.ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌పూర్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దేవి‌సింగ్ పటేల్ గుండెపోటుతో మృతి చెందారు.అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుంచి చికిత్స పొందుతున్న పటేల్ గుండెపోటు రావడంతో బర్వాణీ హాస్పిటల్‌లో ఉదయం 5గంటలకు తుదిశ్వాస విడిచారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు పటేల్. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాల బచ్చన్‌ను ఓడించేందుకు బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన దేవిసింగ్ పటేల్ అంతలోనే కన్నుమూయడం బీజేపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుండగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న దేవి‌సింగ్ పటేల్ గుండెపోటుతో కన్నుమూయడం బిజెపి పార్టీకి నష్టం అనే చెప్పుకోవాలి..ఎందుకంటే ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ ఆయన.

మొదటిసారి 1989లో ఎన్నికల్లో అంజాద్ నుంచి పోటీచేసి విజయం సాధించిన పటేల్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు.మూడు సార్లు అంజర్ నుంచి గెలవగా ఒకసారి రాజ్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.2013 లో రాజ్ పూర్ నుంచి గెలిచాడు. బీజేపీ నేత పటేల్ అంత్యక్రియలు స్వగ్రామమైన బంద్రాకచ్చా నిర్వహించనున్నారు.ఈయన మృతివార్త తెలిసి నరేంద్రమోడీ,అమిత్ షా షాక్ అయ్యారు. దేవి‌సింగ్ పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళు నివాళి అర్పించారు.అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్ర బిజెపి నాయకులు పలువురు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళి అర్పించారు.