బిత్తిరి సత్తి టీఆర్‌ఎస్‌లోకి.?టికెట్ కన్ఫామ్? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదే..!!

331

బిత్తిరి సత్తి..ఈ పేరు వింటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పెదాల మీద చిరునవ్వు వస్తుంది.ఒక ప్రముఖ ఛానెల్ లో న్యూస్ రీడర్ నుంచి యాంకర్ స్థాయికి వెళ్లి తన బిత్తిరి పనులతో ఎంతో మందిని నవ్వించి ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.తీన్మార్ వార్తలు అంటూ ఒకవైపు నవ్విస్తూ మరొకవైపు సమాజానికి ఉపయోగపడే అంశాలను తనదైన శైలిలో చెప్తూ ప్రేక్షకులను కట్టిపడేసేవాడు.ఇతని గురించి తెలియని తెలుగువాడంటూ ఉండడు.అలాంటి బిత్తిరి సత్తి గురించి ఇప్పుడు ఒక వార్త రాష్ట్ర రాజకీయాలలో హల్చల్ చేస్తుంది.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి అనతికాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తీన్మార్ అనే సెటైరికల్ న్యూస్ తో అలరించడమే కాదు తెలంగాణ యాస మేళవించి కడుపుబ్బా నవ్విస్తాడు బిత్తిరి సత్తి. ఒక్క బిత్తిరి సత్తి ప్రోగ్రాం వల్లే వీ6 టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెరిగాయి. యాంకర్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి, ప్రస్తుతం సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మీడియాలో సత్తి క్రేజ్ కున్న డిమాండ్ అంతా ఇంతకాదు.ఇది ఇలా ఉంచితే ప్రస్తుతం మరో వార్త ఇప్పుడు మీడియాలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రకటించిన అభ్యర్థుల్లో ఇద్దరు సిట్టంగ్ లను పక్కన పెట్టిన కేసీఆర్ అందులో మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలో బాబు మోహన్ స్థానంలో జర్నలిస్ట్ క్రాంతికిరణ్ ను నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మీడియాకు చెందిన బిత్తిరి సత్తిని టీఆర్ఎస్ తరపున బరిలోకి దింపేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాల్లో హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కూడా ఉంది.ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కనకా రెడ్డికి ఈసారి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేది కష్టంగానే ఉంది.ఈ క్రమంలో బీసీ అభ్యర్థిగా బిత్తిరి సత్తిని నిలబెట్టేందుకు టీఆర్ఎస్ యోచిస్తోంది. బిత్తిరి సత్తి అత్యంత సన్నిహితుల సమాచారం మేరకు ఇప్పటికే టికెట్ కన్ఫామ్ అని తెలియడంతో ఆరు నెలల నుంచి సత్తి ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పైగా వీ6 అధినేత జి.వివేక్ టీఆర్ పార్టీలో కీలకంగా ఉన్నారు. బిత్తిరి సత్తికి ఆయన అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో టీడీపీ తరపును గెలిచిన బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు ప్రత్యామ్నాయంగా బిత్తిరి సత్తిని పైకి తెచ్చేందుకు కేసీఆర్ ప్లాన్ లో ఇది ఒక భాగమని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.చూడాలి మరి బిత్తిరి సత్తి రాజకీయ అరంగ్రేటం ఉంటుందో ఉండదో.