బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఉన్నారో చూస్తే షాక్

401

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ ఎఫెక్టుతో స్టార్ మాటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోగా….నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ ఆ స్థాయికి వెళ్లక పోయినా మంచి హిట్టయింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ 3 సీజ‌న్ ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కోసం కసరత్తు మొదలైంది. షో హోస్ట్, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి షోను ఎవరు హోస్ట్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ పేరు వినిపించగా, తాజాగా విక్టరీ వెంకటేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

 

రెండో సీజన్ ప్రముఖులు, సామాన్యుల కలయికతో సాగింది. మూడో సీజన్లో కూడా సెలబ్రిటీలు, సామాన్యుల పోటీదారులుగా ఉంటారని తెలుస్తోంది. అయితే షో జరిగే విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 3 విషయంలో ఈ సారి కొందరు టాప్ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో రేణు దేశాయ్, గద్దె సింధూర, శోభిత ధూళిపాల, వరుణ్ సందేశ్, ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ పొట్టి గణేష్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ జాహ్నవి(మహాతల్లి) ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ 2వ సీజన్… మొదటి సీజన్ స్థాయిలో హిట్ కాకపోవడానికి కారణం ఇందులో టాప్ సెలబ్రిటీలు లేక పోవడం. బిగ్ బాస్ సీజన్ 3లో టాప్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తే ఈ సారి రియాల్టీ షో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. బిగ్ బాస్ 2వ సీజన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగడం వల్ల చాలా విషయాలు ముందే లీక్ అవ్వడం…. నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ సారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే బిగ్ బాస్ 3 సెట్ ఎక్కడ వేయబోతున్నారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రియాలిటీ షోల దెబ్బకు సీరియల్స్ మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ షో ఇప్పుడు టివి ఛానల్స్ కు మంచి రేటింగ్ ను అందిస్తుండడంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు.మరి వీరిలో ఎవ‌రు బెస్ట్ అనిపిస్తున్నారు అలాగే కొత్త‌గా ఇంకెవ‌రిని తీసుకుంటే బెట‌ర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.