BREAKING NEWS:రామ్‌చరణ్‌ చిత్రంలో బిగ్‌బాస్‌ కౌశల్‌.!

94

కౌశల్ ..ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ నామమే వినిపిస్తుంది.పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినోట ఇతని పేరే.బిగ్ బాస్ హౌస్ లో అతను పడ్డ కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది.ఎంతో నేర్పరి,ఎంతో సహనశీలి,ఎంతో దృఢ సంకల్పం,ఎంతో తెలివి..ఇలా చెప్పుకుంటూపోతే కౌశల్ లో ఎన్నో ఉన్నాయి.అవే ఇప్పుడు అతనిని స్టార్ చేశాయి.113 రోజుల్లో ఒక సాధారణ నటుడికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.అందులో అతను పడ్డ కష్టం ఎంతో ఉంది.అయితే ఆ కష్టమే ఇప్పుడు కౌశల్ కు తిరుగులేని సినిమా అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి.ఇప్పుడు ఒక క్రేజీ మూవీలో మంచి ఆఫర్ కొట్టేశాడు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’.. ప్రముఖ బుల్లితెర నటుడు కౌశల్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసేసింది. ‘బిగ్‌బాస్’ విజేతగా నిలిచిన కౌశల్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ‌బిగ్‌బాస్‌ ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్యన్‌ రాజేశ్‌ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి తన తండ్రి చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘స్టేట్‌ రౌడీ’ పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ సినిమాలో అవకాశం రావడం నిజంగా కౌశల్ అదృష్టమనే చెప్పుకోవాలి.అయితే ఈ చిత్రమే కాకుండా ఇంకా చాలా అవకాశాలు వస్తున్నాయంట.అయితే ప్రస్తుతం తన బిజినెస్ పనులు చూసుకుంటూ మరొకవైపు కొత్త సినిమా కథలలో తనకు వస్తున్న అవకాశాల గురించి ఆలోచిస్తున్నాడంట.తన కెరీర్ కు ఉపయోగపడతాయి అనుకున్న పాత్రలనే ఎంచుకుంటున్నాడంట.బిగ్ బాస్ వలన ఒక వ్యక్తి జీవితమే మారిపోతుందనడానికి కౌశల్ ఉదాహరణ అనే చెప్పుకోవాలి కదా.కష్టపడితే వృధా పోదని ఊరికే అంటారా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.