బిగ్ బాస్ షో లో ఇవేం పాడు పనులు…బూత్ పురాణం మరీ ఎక్కువైంది…

710

Related image

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 షో రోజురోజుకు రసవత్తరంగా సాగుతుంది.ఇంట్లో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తితో తిలకిస్తున్నారు.అయితే ఎక్కువ శాతం మందికి బిగ్ బాస్ రోజు రోజుకూ శృతి మించుతోంది అని అనిపిస్తుంది.మాటలకు, చేతలకు హద్దులు లేకుండా పోతున్నాయి. లేటెస్ట్ గా టెలికాస్ట్ అయిన షో మరీ బూతుమయంగా సాగింది. హౌస్ మెంబర్ల తిట్లు, చేతలు వెగటు పుట్టించాయి. జనాలు చూడాలని.. రేటింగ్ పెరగాలని మరీ ఇంతలా దిగజారుతారా..? అని సగటు ప్రేక్షకుడికి అనిపించేలా మారింది షో.ఇంతకు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ పక్షులు ఎక్కువయ్యారు.ముఖ్యంగా తేజస్విని సామ్రాట్ మరియు తనిష్ దీప్తి సునైనా ల మద్య జరుగుతున్నది చూస్తుంటే వీళ్ళేంటి ఇంతలా రెచ్చిపోతున్నారు అని అనకుండా ఉండలేకపోతున్నారు.హగ్స్ చేసుకోవడం పక్కపక్కనే పడుకోవడం లాంటివి చూస్తుంటే వీళ్ళ మద్య బంధం చాలా దూరం పోయింది అని అనిపిస్తుంది.ఒకసారి అయితే అందరు నిద్ర పోయాకా దీప్తి సునైనా వెళ్లి తనిష్ కు ముద్దు కూడా పెట్టింది.ఈ విషయం గురించి సోషల్ మీడియా లో పెద్ద పెద్ద ట్రోల్స్ కూడా వేశారు.ఇప్పుడు మళ్ళి అందరికి ట్రోల్స్ వచ్చేలా మరికొన్ని సంఘటనలు జరిగాయి.లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా మంచి చెడు ఆట ఆడాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్ లోని ఒక టీం బ్లాక్ డ్రెస్ లో.. మరో టీం వైట్ డ్రెస్ లో ఆటను మొదలుపెట్టింది. అది కాస్తా కాసేపటికే రచ్చ రచ్చైంది. టాస్క్ లో భాగంగా భానుశ్రీ తాను వేసుకున్న కోట్ లో ఓ బాల్ పెట్టుకుంది. దానిని తీసేందుకు కౌశల్ ప్రయత్నించాడు. అంతే రచ్చ మొదలైంది.

కౌశల్ చేయి తన డ్రెస్ లోపల పెట్టాడని.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడని రచ్చ చేసింది భానుశ్రీ. ఆమెకు తేజస్వీ తోడు కావడంతో షో మొత్తం గందరగోళంగా మారింది. భానుశ్రీకి స్వారీ చెప్పాలని కౌశల్ పై యుద్ధం మొదలెట్టింది తేజస్వీ. చేయి తగల్లేదని తాను చూశానని గీతామాధురి చెప్పినా తేజస్వీ పట్టించుకోలేదు. కౌశల్ ను నానా మాటలు అంటూ హంగామా చేసింది. అంతకుముందు కూడా కొందరిని జైల్ లో పెట్టే క్రమంలో లేడీస్ ని జెంట్స్ పట్టుకున్న విధానం మరీ ఘోరంగా ఉంది. మొదట తేజస్వీనిని తనీష్ పట్టుకుని లాక్కెళ్లడం ఆ తర్వాత దీప్తి సునయనను సామ్రాట్ ఎత్తుకుని పట్టుకెళ్లడం వారి ప్రవేట్ పార్ట్స్ ని టచ్ చేయడం ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని వారిని జైళ్లలోకి తీసుకెళ్లడం అసభ్యకరంగా ఉంది. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసేలా ఈ షో లేదనే విమర్శలు వస్తున్నాయి.అలాగే భానుశ్రీ తన డ్రెస్ మీద వేసుకున్న జాకెట్ ను విప్పుతూ తనిష్ కు చూపిస్తూ కొంచెం మసాల కూడా ఇచ్చింది.ఈ విషయం గురించి దీప్తి గీతా బాబు గోగినేని మాట్లాడుకోవడం ప్రేక్షకులకు ఇదేమి షో రా అని అనిపించింది.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు.ఫ్యామిలీ షో కాస్త ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు.హౌస్ లో జరుగుతున్న భూత్ పురాణం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.