నూతన్ నాయుడు పెద్ద చీట‌ర్ టాప్ హీరోయిన్ తో అఫైర్ ఆమెకు కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్

1392

ఎటువంటి వివాదాలు లేకుండా న‌డుస్తున్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గురించి కాస్త‌ వివాదాలు కూడా ఇప్పుడు బ‌య‌ట జ‌రుగుతున్నాయి.. బిగ్ బాస్ షోలో ఇప్ప‌టికే బాబు గోగినేనిపై ప్రైవ‌సీ వివ‌రాల విష‌యంలో కేసు న‌మోదు అయింది.. ఇక తాజాగా బిగ్‌బాస్ 2 షో నుండి రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు…. మళ్లీ వైల్డ్ కార్డ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎంతో మంది ప్రేక్షకుల ఓట్లు సంపాదించుకుని బిగ్‌బాస్ హౌస్‌‌లో రీ ఎంటరైన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు చేస్తూ శివ అనే సామాజిక కార్యకర్త మీడియా ముందుకొచ్చాడు. ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ, నూతన్ నాయుడు గురించి ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు. నూతన్ నాయుడు ఒక పొలిటికల్ లాబీయిస్ట్ అని, ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని చెప్పి తమను మోసం చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా నూతన్ ఫోన్ ఆడియో టేపును సదరు ఛానల్ బహిర్గతం చేసింది.

Image result for nutan naidu bigg bossకీర్తి శేషులు వైఎస్ఆర్, సుజనా చౌదరి, పరకాల ప్రభాకర్ తనకు చాలా సన్నిహితులు అని చెప్పేవాడని, నటుడు బాలయ్యను బాలా అని సంబోధిస్తూ తనకు సన్నిహితుడని చెప్పేవాడని, అలాగే భువనేశ్వరిని… భువనక్క అని పిలుస్తూ… వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేవాడని, ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని తమ సోదరుడి ద‌గ్గ‌ర . 3 కోట్లు తీసుకున్నాడని శివ ఆరోపించారు.

Image result for nutan naidu bigg boss

నూతన్ నాయుడు అసలు కామన్ మ్యాన్ కాదని, గతంలో ఎన్నికల్లో పోటీ చేశాడని, ఎక్కడి వెళ్లినా పెద్ద కాన్వాయ్, చుట్టూ మందీ మార్బలంతో వెళతాడని, అతడు కామన్ మ్యాన్ ఎలా అవుతాడు? ఆయన్ను బిగ్‌బాస్ నిర్వాహకులు కామన్ మ్యాన్‌ కేటగిరీలో ఎలా తీసుకున్నారని శివ ప్రశ్నించారు. నేను ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో చూడలేదు. మా సోదరుడితో పాటు మోసపోయిన బాధితులు వచ్చి మీరు అప్పటి నుండి వెతుకుతున్న నూతన్ నాయుడు ఇతడే అని చెప్పారు. నేను ఇన్ని రోజులు అతడిని మేదపురెడ్డి నూతన్ కుమార్ అనుకున్నాను. అతడే నూతన్ నాయుడు అని నాకు ఇప్పటి వరకు తెలియదు. మెంటర్ టెక్నీలజీన్ అని బంజారాహిల్స్ రోడ్ నెం.14లో అతడి ఆఫీస్ ఉంది. అతడి ఆఫీస్ అకౌంట్ డీటేల్స్ తీయిస్తే అతడి బాధితుల వివరాలు బయటకు వస్తాయి… అని శివ తెలిపారు.

Image result for nutan naidu bigg boss
ఇప్పుడు కూడా రాజకీయ లబ్ది కోసమే బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లాడు ఇప్పుడు కూడా రాజకీయంగా ఫేం సంపాదించడానికి, రాజకీయంగా లబ్దిపొందడానికి బిగ్‌బాస్ షోలోకి ఎంటరయ్యాడని శివ ఆరోపించారు…మా ద‌గ్గ‌ర డబ్బులు తీసుకున్న తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఆయన్ను వెతకడాని అతడు ఉంటున్న హౌస్ వద్దకు వెళితే ఇంటి ఓనర్ చాలా విషయాలు చెప్పాడు. ఒక హీరోయిన్ వద్ద ఇంప్రెషన్ కొట్టేయడానికి రూ. 35 లక్షలు ఖర్చు పెట్టాడని శివ చెప్పుకొచ్చారు.

త్వరలోనే నూతన్ నాయుడు మీద కేసు పెడుతున్నామ‌ని. మాద‌గ్గ‌ర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి. బిగ్‌బాస్ ఇంటి నుండి అతడిని బయటకు రప్పిస్తాం… అని శివ అన్నారు. శివ ఆరోపణలతో అంతా షాక్ అయ్యారు.. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల నుంచి నూతన్ నాయుడు మీద పాజిటీవ్ ఓపినియ‌న్ ఉంది ఇప్పుడు ఇది కాస్త నెగిటీవ్ అయ్యే ప్ర‌మాదం ఉంది అంటున్నారు. చూడాలి ఈ వ్య‌వ‌హారం ఎటువంటి మ‌లుపులు తిరుగుతుందో. మీరు నూత‌న్ విష‌యంలో ఏమ‌నుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.