Big Breakingnews : దెబ్బకు దెబ్బ తీసిన సైనికులు.. యుద్ధ విమానాలతో భారత సైనికులు ఏం చేశారంటే..

260

దేశం మొత్తం మీద ఇప్పుడు ఒకదాని గురించే చర్చ జరుగుతుంది. అదే పుల్వామాలో ఉగ్రదాడి. ఒకరు కాదు ఇద్దరు కాదు 44 మందిని పొట్టనపెట్టుకుంది ఈ ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్ అత్యంత సున్నితమైన రాష్ట్రమనే విషయం తెలిసనప్పటికీ, ఉగ్రవాదుల కార్యకలాపాలు మితిమీరినట్లు తెలిసినప్పటికీ.. నిఘా విభాగం గానీ, జాతీయ భద్రత ఏజెన్సీ గానీ ఏం చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ రహదారి మీద, 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్ పై పట్టపగలు ఉగ్రవాదులు దాడులు చేయాల్సిన పరిస్థితి ఎలా ఉత్పన్నమైందనే సందేహాలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా ఉగ్రవాదులు నిద్రాణంగా ఉన్న నేపథ్యంలో.. ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉందని అంటూ నివేదికలు వచ్చిన తరువాత కూడా పట్టించుకోలేదనే విమర్శలకు తావిచ్చినట్టయింది.

Image result for pulwama

అయితే ఈ దాడి తరువాత ఇండియన్ ఆర్మీ చాలా ఆవేశంగా ఉంది. సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అని ఇండియన్ ఆర్మీ అంటుంది. పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

జమ్మూ కాశ్మీర్ లో ఆరుగురు ఏర్పాటువాద నేతలకు కల్పిస్తున్న సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే యుద్దానికి ఎప్పుడైనా పిలుపు ఇవ్వొచ్చు. అందుకే ఆర్మీ యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇండియా వద్ద ఉన్న అణుబాంబులను కూడా సిద్ధంగా ఉంచారు. పాక్ ను ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టొచ్చు ఏ ఏ మార్గాలలో దెబ్బ కొట్టొచ్చు అన్ని సిద్ధం చేస్తున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆర్డర్ రాగానే యుద్ధం చెయ్యడానికి రెడీగా ఉన్నారు. భారత ఆర్మీని చూసి పాకిస్తాన్ వణికిపోతుంది. ఒకవేళ యుద్ధం జరిగితే పాక్ చాలా నష్టపోతుంది. అందుకే పాక్ వణికిపోతుంది. చూడాలి మరి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు. యుద్ధం చేస్తే మంచిదా కాదా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.