Breaking NEWS:డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ స్టార్ హీరోయిన్..పోలీసులకు చుక్కలు చూపించింది

367

ఇటీవ‌ల పోలీసులు ఎన్ని సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నా బ‌డాబాబుల పిల్ల‌ల‌తో పాటు సాధార‌ణ జ‌నం కూడా అడ్డంగా దొరుకుతున్నారు చుక్క‌వేసి చ‌క్క‌ని చుక్క‌లు పోలీసుల‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు. ఇక రోడ్డు ప్ర‌మాదాలు కూడా ఇలా మ‌ద్యం సేవించి బండి న‌డ‌ప‌డం వ‌ల్ల మ‌రింత పెరుగుతున్నాయి దీనిపై ఎన్నిసార్లు వారిని హెచ్చ‌రించినా ఎంత క్యాంపెయినింగ్ చేసినా వారిలో మార్పు మాత్రం రావ‌డం లేదు. తాజాగా సాధార‌ణ జ‌నంతో పాటు ఇప్పుడు సెల‌బ్రెటీలు అత్య‌ధిక మంది ఇలా పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోతున్నారు.

భారత దేశంలో రోజు రోజుకీ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రద్దీగా ఉన్న జనావాసాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తు మందు బాబుల భరతం పడుతున్నారు. ఇలా డ్రంకెన్ డ్రైవ్ లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభుత్వాధికారులు సైతం పట్టుపడటం రోజూ చూస్తునే ఉన్నాం. తాజాగా ప్రముఖ నటి, నృత్య కళాకారిణి, బిగ్ బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయింది.

ఈ విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో సినీ సెలబ్రిటీలు పాల్గొన్న ఓ పార్టీకి వెళ్లిన ఆమె, తిరిగి వస్తున్న వేళ, అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద పోలీసు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గాయత్రీ రఘురామ్ బ్రీత్ అనలైజర్ లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఈ స‌మ‌యంలో త‌మ సిబ్బంది ఆమెకు బ్రీ్ అన‌లైజ‌ర్ టెస్టులో ఆమె మ‌ద్యం ఎక్కువ‌గా సేవించిన‌ట్టు రిపోర్టు వ‌చ్చింది అని ఆమెని అరెస్ట్ చేశాము అని తెలియ‌చేశారు. ఇక ఆమె కూడా ఒప్పుకోవ‌డంతో పోలీసులు ఆమెకి ఫైన్ విధించారు… దీంతో ఆ రోడ్డుపై త‌నిఖీలు జ‌రుగుతున్నాయి అని వేరే రూటులో నుంచి మందు బాబులు ప‌రార‌య్యారు.